టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ఇలాంటి చెత్త పిచ్‌లా... టాస్ ఓడితే చాలు, మ్యాచ్ పోయినట్టేనా...

First Published Oct 24, 2021, 3:46 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. క్వాలిఫైయర్స్ మ్యాచుల్లోనూ మంచి స్కోర్లు నమోదయ్యాయి. వార్మప్ మ్యాచుల్లో అయితే భారీ స్కోరింగ్ మ్యాచులు చూసేందుకు అభిమానులకు అవకాశం దక్కింది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచులు జరిగిన మైదానాల్లోనే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మ్యాచులు జరుగుతున్నాయి. వరుసగా మ్యాచులు జరుగుతుండడంతో ఆ ప్రభావం పిచ్‌లపై భారీగా పడింది...

క్వాలిఫైయర్స్ రౌండ్‌లో నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ కేవలం 17.1 ఓవర్లలోనే ముగిసింది. పసికూన నెదర్లాండ్స్ జట్టు కేవలం 44 పరుగులకే ఆలౌట్ అయ్యి, చెత్త రికార్డు క్రియేట్ చేసింది...

నెదర్లాండ్స్‌ చిన్న జట్టు కావడం, పెద్దగా క్రికెట్ ఆడిన అనుభవం లేని జట్టు కావడంతో అది పెద్ద విషయం కాదని కొట్టేశారు క్రికెట్ విశ్లేషకులు...

అయితే ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచులు కూడా ఇలా లో స్కోరింగ్ మ్యాచులగానే ముగియడంతో ఫ్యాన్స్‌లో కలవరం మొదలైంది...

అబుదాబీలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. 119 పరుగుల టార్గెట్, అంటే బాల్‌కి ఒక్క సింగిల్ తీసినా ఈజీగా దక్కే విజయం...

అయినా ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆస్ట్రేలియా వంటి జట్టు ముప్పుతిప్పలు పడింది. చివర్లో స్టోయినిస్ మెరుపులు మెరిపించడంతో 2 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది...

ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే మరో లెవెల్. క్రిస్ గేల్, పోలార్డ్, రస్సెల్ వంటి వరల్డ్ క్లాస్ హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కి ప్రయత్నించి అవుట్ కావడంతో వెస్టిండీస్ పతనానికి వారి బ్యాట్స్‌మెన్ చేసిన పొరపాట్లే కారణమనుకున్నారంతా...

అయితే 56 పరుగుల సింపుల్ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్... తొలి వికెట్ 21 పరుగుల వద్ద పడింది కాబట్టి సరిపోయింది, అదే సింగిల్ డిజిట్ లోపు వికెట్ పడి ఉంటే, ఇంగ్లాండ్ పరిస్థితి కూడా వేరేగా ఉండేదేమో...

టీ20 మ్యాచుల్లో భారీ సిక్సర్లు, బౌండరీల మోత చూద్దామని ఆశించిన అభిమానులకు గత మూడు మ్యాచులు టెస్టులను తలపించాయి. లో స్కోరింగ్ గేమ్‌లు నమోదు కావడమే కాకుండా చాలా నిదానంగా సాగి ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి...

అదీకాకుండా గత నాలుగు మ్యాచుల్లో మూడింట్లో టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లకే విజయం దక్కింది. నమీబియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్, ఓటమిపాలై సూపర్ 12కి అర్హత సాధించలేకపోయింది...

అసలే విరాట్ కోహ్లీకి టాస్ గెలవడంలో పెద్దగా మంచి రికార్డు లేదు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పరిస్థితి ఏంటనేది? అభిమానులను భయపెడుతున్న విషయం...

అయితే టీమిండియాపై పాకిస్తాన్‌కి ఛేదనలో ఏమంత సరైన రికార్డు లేదు. కాబట్టి టాస్ గెలిచినా ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది...

click me!