T20 Worldcup 2021: ఇది ధర్మానికి విరుద్ధం, ప్రాణాలు తీస్తున్న వాళ్లతో క్రికెట్ మ్యాచులా... - రామ్‌దేవ్ బాబా..

First Published Oct 24, 2021, 3:08 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో దాయాదుల మధ్య పోరుకి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో  పాకిస్తాన్‌పై ఉన్న కొనసాగించాలనే పట్టుదలతో భారత జట్టు, ఎలాగైనా గెలిచి తొలి విజయాన్ని అందుకోవాలనే కసితో పాకిస్తాన్... ఈ మ్యాచ్‌కి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి..,

అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ ఏడాదిలో అతి పెద్ద క్రికెట్ ఫైట్‌గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే శత్రదేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడడాన్ని కొందరు రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు. శ్రీనగర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్లే దీనికి కారణం...

తాజాగా పతాంజలి ఆయుర్వేద సంస్థ అధినేత, ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా కూడా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గురించి స్పందించాడు. 

‘ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడం అనేది రాష్ట్ర ధర్మానికి వ్యతిరేకం. కొన్నిసార్లు ప్రజలకు ఇష్టం లేకపోయినా ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది...

పాక్‌తో మ్యాచ్ ఆడడాన్ని జనాలు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది క్రికెట్ గేమ్‌కీ, తీవ్రవాదుల రాక్షస క్రీడకీ మధ్య మ్యాచ్‌లా ఉంది. ఈ రెండూ ఒకేసారి ఆడడం కుదరదు..’ అంటూ కామెంట్ చేశాడు రామ్‌దేవ్ బాబా...

పాక్‌‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలంటూ నెటిజన్ల నుంచి, రాజకీయ నేతల నుంచి విపరీతంగా డిమాండ్లు వినిపించాయి. ఓ పక్క వాళ్లు మన సైనికుల ప్రాణాలు తీస్తుంటే, మీరు వారితో క్రికెట్ మ్యాచ్ ఆడతారా? అంటూ విమర్శలు వచ్చాయి...

అయితే ఐసీసీ టోర్నీల్లో ఏ దేశంతో అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని... క్రికెట్ మ్యాచ్‌కీ, దేశ రాజకీయాలకు ముడి పెట్టలేమంటూ బీసీసీఐ అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే...

click me!