టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న అంపైర్... అతనున్న ప్రతీ మ్యాచ్‌లోనూ భారత జట్టుకి...

First Published Oct 31, 2021, 4:16 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. అసలే న్యూజిలాండ్‌పై గత 18 ఏళ్లల్లో ఒక్కసారి ఐసీసీ మ్యాచ్ గెలవని చెత్త రికార్డు. దానికి మరో విషయం కూడా భారత జట్టు అభిమానులను తీవ్రంగా భయపెడుతోంది. అదే అంపైర్ రిచర్డ్ కెటెల్‌బోరోగ్...

న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగే టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌కి మారస్ ఎరాస్మస్‌తో పాటు ఇంగ్లాండ్‌కి చెందిన రిచర్డ్ కెటెల్‌బోరోగ్ కూడా ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించబోతున్నాడు...

అయితే టీమిండియకి రిచర్డ్ కెటెల్‌బోరోగ్ అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ నాకౌట్ మ్యాచులోనూ విజయం దక్కలేదు. 2014 నుంచి రిచర్డ్ కెటెల్‌బోరోగ్ అంపైర్‌గా వ్యవహరించిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఓడింది టీమిండియా...

2014లో ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి అంపైర్‌గా వ్యవహరించాడు రిచర్డ్. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడింది. 13 బంతులు మిగిలి ఉండగానే లంకకు విజయం దక్కింది...

2015 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ రిచర్డ్ కెటెల్‌బోరోగ్ అంపైరింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 328 పరుగుల భారీ స్కోరు చేయగా, టీమిండియా 233 పరుగులకే ఆలౌట్ అయ్యింది...

2016 టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లోనూ రిచర్డే అంపైర్. వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు 192 పరుగుల భారీ స్కోరు చేసినా, 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మనోడే ఫీల్డ్ అంపైర్. పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను ఇప్పటికీ ఓ పీడకలలా మరిచిపోలేకపోతున్నారు టీమిండియా ఫ్యాన్స్...

2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కూడా రిచర్డ్ కెటెల్‌బోరోగే అంపైర్.  ఈ మ్యాచ్‌లో ఎమ్మెస్ ధోనీ రనౌట్ అయినప్పుడు రిచర్డ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ జనాలందరికీ గుర్తుండిపోయింది...

ఆఖరికి ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కి కూడా రిచర్డ్ కెటెల్‌బోరోగ్ అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే ఫీల్డ్ అంపైర్‌గా కాకుండా థర్డ్ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచులన్నింటీలో భారత జట్టుకి విజయం దక్కలేదు...

ఇప్పటికే రిచర్డ్ కెటెల్‌బోరోగ్ అంపైర్‌గా వస్తున్నాడని తెలియడంతో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఓ ఫన్నీ మీమీ పోస్టు చేశారు. ‘మమ్మల్ని క్షమించండి... ఓం సాయి రాం’ అంటూ భారత ఫ్యాన్స్ భయపడుతున్నట్టు ఫోటో పోస్లు చేసిన జాఫర్ ‘హ్యాపీ హల్లోవీన్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు.

click me!