T20 worldcup 2021: పాకిస్తాన్‌తో ఇండియాలో మ్యాచ్... అది సాధ్యంకాదన్న బీసీసీఐ బాస్...

Published : Oct 23, 2021, 04:36 PM ISTUpdated : Oct 23, 2021, 04:37 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. శ్రీనగర్ ఏరియాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు, ఎన్‌కౌంటర్ల కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అయితే ఐసీసీ టోర్నీల్లో ఏ దేశంతోనైనా మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉండాలని, దీన్ని ఓ మ్యాచ్‌గానే చూడాలంటూ తేల్చేసింది బీసీసీఐ...

PREV
111
T20 worldcup 2021: పాకిస్తాన్‌తో ఇండియాలో మ్యాచ్... అది సాధ్యంకాదన్న బీసీసీఐ బాస్...

ఐసీసీ టీటీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మ్యాచులకు టికెట్ల సేల్స్ ప్రారంభించగానే భారత్, పాక్ మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. కేవలం నిమిషాల గ్యాప్‌లోనే టికెట్లన్నీ బుక్ అయిపోయాయంటే ఈ మ్యాచ్‌కి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు...

211

క్రికెట్ వరల్డ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కి ఉండే క్రేజ్... మరే మ్యాచ్‌కీ ఉండదు. భారత్, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్ల మధ్య మ్యాచులు చూసేందుకు జనాలు ఇష్టపడినా, దాయాదుల పోరుకి ఉండే క్రేజే వేరు...

311

‘టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడాలనేది ప్లానింగ్ ప్రకారం ఏం చేసింది కాదు. ఐసీసీ అలా నిర్ణయించిందంతే. అయితే నాకు తెలిసి ఇది మొదటిసారేం కాదు...

411

2015 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా టీమిండియా, తన మొదటి మ్యాచ్‌ పాకిస్తాన్‌తోనే ఆడింది. 2019లో అలా జరగలేదు... 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇండియా, పాక్‌తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడింది...

511

ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను చూడడానికి జనాలు ఎగబడతారో, నిర్వహకులు ఆ మ్యాచ్‌తోనే టోర్నీని ప్రారంభించాలని అనుకుంటారు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లోనూ భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చనుకుంటా...

611

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడాన్ని నేనెప్పుడూ ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టుగా పాక్‌తో మ్యాచ్ సమయంలో మాకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. చాలా ఫ్రీగా ఆడతాం...

711

2016 టీ20 వరల్డ్‌కప్ సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించడం చాలా కష్టమైంది. ఆ టైం‌లో నేను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నా...

811

భారత్, పాక్ మ్యాచ్‌ ఏమో కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరిగింది. ఆ మ్యాచ్‌ టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దాదాపు 70 వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియంలో కూడా టికెట్లు సరిపోలేదు...

911

ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోయాయి. ఆఫ్ లైన్ ద్వారా అమ్మిన టికెట్ల కోసం కిలో మీటర్ల మీర క్యూలు కనిపించాయి. ఆ జనాలను కంట్రోల్ చేయడం మరింత కష్టమైపోయింది...

1011

ఇవీకాక మాకు టికెట్లు కావాలంటూ సిఫారసులు, డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చేవి. వామ్మో... టికెట్లను అమ్మడం కూడా ఇంత కష్టమా... అనిపించేలా ఉంటుందా పరిస్థితి...’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

1111

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ జరగాల్సింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి యూఏఈకి వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

click me!

Recommended Stories