T20 worldcup 2021: వెంకటేశ్ అయ్యర్‌తో సహా ఆ నలుగురు స్వదేశానికి... టీమిండియాకి నెట్‌ బౌలర్ల కొరత...

First Published Oct 22, 2021, 10:45 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ  ఆరంభానికి ముందు భారత జట్టుకి ఓ చిన్న షాక్ తగిలింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి, టీ20 వరల్డ్‌కప్ 2021కి నెట్‌ బౌలర్లుగా ఎంపికైన ప్లేయర్లు, మెగా టోర్నీ ఆరంభానికి ముందే స్వదేశానికి పయనం కానున్నారు..

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు వెంకటేశ్ అయ్యర్...
 

బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టడంతో అతన్ని నెట్‌ బౌలర్‌గా ఎంచుకుంది బీసీసీఐ...

ఐపీఎల్ ముగిసిన తర్వాత అయ్యర్‌తో పాటు కర్ణ్ శర్మ, షాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్, ఉమ్రాన్ అక్మల్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, లూక్మన్ మెరివాలా... బీసీసీఐ బయో బబుల్‌లో చేరారు...

వీరంతా టీమిండియాకి ప్రాక్టీస్‌లో నెట్ బౌలర్లుగా సహకరిస్తారని ప్రకటించింది బీసీసీఐ. అయితే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ప్రారంభం అవుతుండడంతో వీరిలో నలుగురు స్వదేశానికి పయనం కానున్నట్టు సమాచారం...

మధ్యప్రదేశ్‌‌కి ఆడే వెంకటేశ్ అయ్యర్, ఉత్తరప్రదేశ్‌‌ జట్టుకి కర్ణ్ శర్మ, బెంగాల్ జట్టుకి షాబజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్ కర్ణాటక జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు...

నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీకి అందుబాటులో ఉండేందుకు ఈ నలుగురు యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి రానున్నారు..

వీరితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆఖరి లీగ్‌ మ్యాచుల్లో ఎంట్రీ ఇచ్చి 150+ కి.మీ.ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రాన్ అక్మల్ పేరును సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు కల్పించింది జమ్మూ...

అయితే బీసీసీఐ కోరిక మేరకు ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, లూక్మన్ మెరివాలా మాత్రం టీమిండియాతోనే ఉండి, టోర్నీ ముగిసే వరకూ నెట్‌బౌలర్లుగా వ్యవహరిస్తారని సమాచారం...

నలుగురు ఫాస్ట్ బౌలింగ్ నెట్ బౌలర్లతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ప్రాక్టీస్ సాగించడం టీమిండియాకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. అదీకాకుండా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసిన జట్టులో ఫాస్ట్ బౌలర్ల సంఖ్య కూడా తక్కువే ఉంది...

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తొలుత టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్‌ని కూడా తుదిజట్టులో చేర్చారు... వీళ్లు కాకుండా స్టాండ్ బై ప్లేయర్‌గా దీపక్ చాహార్ ఒక్కడే అందుబాటులో ఉంటాడు...

click me!