T20 worldcup 2021: బౌలింగ్ వేయకపోయినా అతను టీమ్‌లో ఉంటాడు, ఎందుకంటే... విరాట్ కోహ్లీ కామెంట్స్...

First Published Oct 23, 2021, 3:46 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న ఏకైక సమస్య హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్. 2019 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్ధిక్ పాండ్యా, రెండేళ్లు గడిచిపోయినా ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ:  వెన్నెముక సర్జరీ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు జట్టుకి దూరమైన హార్ధిక్ పాండ్యా, గత ఏడాది ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా... బౌలింగ్ చేయలేకపోయాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ 12 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా... ఒక్క బంతిని కూడా బౌలింగ్ చేయలేదు...

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బౌలింగ్ చేసినా, వెన్నునొప్పితో బాధపడడం స్పష్టంగా కనిపించింది.  

‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అతను రోజురోజుకీ మరింత మెరుగవుతున్నాడు. టోర్నీలో కీలక సమయంలో పాండ్యా బౌలింగ్ చేస్తాడు...

నాలుగు ఓవర్లు కాకపోయినా, కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించేవరకూ మాకున్న బౌలింగ్ ఆప్షన్‌ వాడుకోవాలని అనుకుంటున్నాం...

బౌలింగ్ వేయకపోయినా హార్ధిక్ పాండ్యాకి తుదిజట్టులో చోటు ఉంటుంది. ఎందుకంటే ఆరో స్థానంలో అతను చాలా కీలకమైన ప్లేయర్. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో కూడా పాండ్యా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు..

అందుకే ఇప్పుడు అతను చేయలేనిదానిని పట్టుకుని, కరెక్టుగా చేసేదాన్ని తక్కువ చేయలేం కదా... ఇంతకుముందుతో పోలిస్తే, ఇప్పుడు మా బౌలింగ్ విభాగం కూడా చాలా మెరుగైంది...

గతంలో చాలా మ్యాచులు, నాణ్యమైన బౌలర్లు లేకపోవడం వల్లే ఓడిపోవాల్సి ఉంది. ఇప్పుడు మన బౌలర్లే మ్యాచ్ విన్నర్లుగా మారారు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

click me!