టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా... మళ్లీ ఆ జట్టుతోనూ అసలైన ముప్పు...

First Published Jul 16, 2021, 4:27 PM IST

టీ20 వరల్డ్‌కప్ గ్రూప్‌లను ప్రకటించింది ఐసీసీ. అనుకున్నట్టుగానే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో రావడంతో 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకి అసలు ముప్పు న్యూజిలాండ్‌తోనే...

ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌పై భారత జట్టు విజయం సాధించి, 15 ఏళ్లు దాటిపోయింది. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించిన టీమిండియా, 2007 టీ20 వరల్డ్‌కప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో పరాజయం పాలైంది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియాను సెమీస్‌లో 18 పరుగుల తేడాతో ఓడించిన న్యూజిలాండ్, ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ గెలిచి టైటిల్ గెలిచింది...
undefined
ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ 2021 సీజన్‌లోనూ అసలు సమస్య న్యూజిలాండ్‌తోనే ఎదురుకానుంది. గ్రూప్‌ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో పాటు మరో రెండు జట్లు చోటు దక్కించుకోనున్నాయి..
undefined
గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చే ఆ రెండు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఏదైయినా భారత జట్టుకి పెద్దగా సమస్య రాకపోవచ్చు. ఇక మిగిలిన ఆఫ్ఘాన్‌ను ఓడించడమూ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...
undefined
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి మంచి ఘనమైన రికార్డు ఉంది. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రిజల్ట్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే... సెమీస్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు...
undefined
మరోవైపు గ్రూప్ 1 చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ కూడా గ్రూప్ 1లోనే ఉన్నాయి. సౌతాఫ్రికా పెద్దగా ఫామ్‌లో లేకపోయినా, ఐసీసీ టోర్నీల్లో అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదు...
undefined
గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్, భారత్ (మరీ దారుణంగా ఆడకపోతే) సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తుంటే, గ్రూప్ 1 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లలో రెండు జట్లు సెమీస్ చేరే అవకాశం ఉంది.
undefined
ఇప్పటికే విండీస్ టూర్‌లో వరుసగా మూడు టీ20ల్లో ఓడి, నాలుగో మ్యాచ్‌లో ఉత్కంఠపోరులో గెలిచిన ఆస్ట్రేలియాకి... టీ20 వరల్డ్‌కప్‌లోనూ వెస్టిండీస్ జట్టు నుంచే అసలు ఛాలెంజ్ ఎదురుకానుంది. అలాగే ఇంగ్లాండ్ జట్టు నుంచి ఆసీస్‌కి గట్టి పోటీ ఎదురుకావచ్చు.
undefined
click me!