వాళ్లు అమ్మాయిల్లా అనిపించరు... మహిళా క్రికెటర్లపై పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ షాకింగ్ కామెంట్స్...

First Published Jul 16, 2021, 3:54 PM IST

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదంలో ఇరుక్కున్నాడు. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ నిదా దర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన అబ్దుల్ రజాక్, అక్కడ వుమెన్ క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారు. రజాక్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

మహిళా క్రికెట్‌పై మాట్లాడేందుకు పాక్ మహిళా క్రికెటర్ నిదా దర్‌తో కలిసి ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూకి హాజరైన అబ్దుల్ రజాక్, అక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడి, క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు...
undefined
‘ఈ ఫీల్డ్‌యే అలాంటిది. మహిళలు ఎవరైనా క్రికెటర్ అవ్వాలనుకుంటే, వాళ్లు పురుషులతో కలిసి పోటీపడాలని అనుకుంటారు. వాళ్లంటే బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వాలని భావిస్తారు...
undefined
చాలామంది మహిళా క్రికెటర్లు, పురుషులు మాత్రమే క్రికెట్‌లో రాణించగలరనే వాదన కరెక్ట్ కాదని నిరూపించాలనే తాపత్రయంతో ఉంటారు. ఈ తాపత్రయం వారిలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను చంపేస్తుంది...
undefined
క్రికెట్‌లోకి వచ్చాక వాళ్లు ఎలా తయారవుతారంటే... వాళ్లకి షేక్ హ్యాండ్ ఇచ్చినా, అమ్మాయిలను టచ్ చేసిన ఫీలింగ్ రాదు...’ అంటూ కామెంట్ చేశాడు అబ్దుల్ రజాక్..
undefined
అంతటితో ఆగకుండా తన పక్కనే కూర్చున్న నిదా దర్, హెయిర్ స్టైల్‌పై కూడా విమర్శలు చేశాడు రజాక్. ‘ఈమె హెయిర్ స్టైల్ చూశారా, తనను చూస్తుంటే అమ్మాయి అనిపిస్తోందా?’ అంటూ కామెంట్ చేశాడు అబ్దుల్ రజాక్...
undefined
సదరు టీవీ ఛానెల్‌లో ఉన్న ఓ మహిళ... ‘పొడవాటి జట్టుతో క్రికెట్ ఆడలేరా’ అంటూ నిదా దర్‌ను ప్రశ్నించగా... ‘కచ్ఛితంగా ఆడగలరు. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే ఇష్టం. అందుకే ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నా...’ అంటూ వివరణ ఇచ్చింది పాక్ వుమెన్ క్రికెటర్.
undefined
మహిళా క్రికెటర్లను, ఓ వుమెన్ క్రికెటర్ ఎదుటే అవమానించిన అబ్దుల్ రజాక్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ వస్తోంది. నిదా దర్ వంటి మహిళా క్రికెటర్లను గౌరవించడం తెలియకపోతే, ఆమెకు ఇండియాకు పంపాలంటూ కామెంట్లు చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...
undefined
click me!