నేనెప్పుడు వాళ్ల కోసం ఆడలేదు, సన్‌రైజర్స్‌కి మరోసారి... డేవిడ్ వార్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Oct 29, 2021, 6:23 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో విఫలమైనా, కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. కెరీర్‌లో మరిచిపోలేని ఐపీఎల్ అనుభవం తర్వాత మంచి ఇన్నింగ్స్‌తో తన రేంజ్‌ను నిరూపించుకున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో 2 హాఫ్ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్, 190+ కి పరుగులు చేశాడు. ఓపెనిర్ జానీ బెయిర్ స్టో తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ నిలిచాడు వార్నర్...

అయితే టీమ్ మేనేజ్‌మెంట్‌తో గొడవల కారణంగా కెప్టెన్సీ కోల్పోయి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కూడా దూరమయ్యాడు డేవిడ్ వార్నర్... గత ఆరు సీజన్లలో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన వార్నర్, ఆరు మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేసి, టీ20 కెరీర్‌లో 20వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 29, రోహిత్ శర్మ 26, బాబర్ ఆజమ్ 22 హాఫ్ సెంచరీల తర్వాత అత్యధిక అర్ధశతకాలు బాదిన ప్లేయర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు వార్నర్...

‘ఇండియాతో జరిగిన వార్మప్ మ్యాచులో నేను అవుటైన తర్వాత అందరూ నా పని అయిపోయిందని ట్రోల్ చేశారు. ఏ బౌలర్, ఎలాంటి బంతులు వేస్తాడో అనుభవం ఉన్న ప్రతీ బ్యాట్స్‌మెన్‌కీ తెలుస్తుంది... 

ఫీల్డర్లు ఎక్కడున్నారో, ఎక్కడెక్కడ పరుగులు రాకుండా ఫీల్డర్లను మోహరించి ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తారో అందరికీ తెలుసు. వికెట్ పడకుండా ఎలా బ్యాటింగ్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు...

అయితే నాకు కొన్ని షాట్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఫీల్డర్ ఉన్నాడని తెలిసినా అలాంటి షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతూ ఉంటా... విమర్శకుల నోళ్లు మూయించాలని నేనెప్పుడూ ఆడలేదు...

ఎందుకంటే ఎలా ఆడినా విమర్శించేవాళ్లు ఉండనే ఉంటారు. బాగా ఆడినప్పుడు పొగడ్తలు వస్తాయి, ఫామ్‌లో లేనప్పుడు విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకుండా మన మీద నమ్మకంతో ఆడితే చాలు...

ఎప్పుడూ ముఖం మీద నవ్వు చెదరకూడదనేది నా పాలసీ... ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని కోల్పోకూడదు...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...

డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ తర్వాత ఓ అభిమాని, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్‌స్టా అకౌంట్ కింద... ‘డియర్ సన్‌రైజర్స్, చూశారా డేవిడ్ వార్నర్ ఈరోజు ఎలా బ్యాటింగ్ చేశాడో...’ అంటూ కామెంట్ చేశాడు...

దానికి మరో అభిమాని... ‘వాళ్లు చూడరు, ఎందుకంటే సన్‌రైజర్స్, వార్నర్‌ను ఎలాగైనా పట్టించుకోకూడదని డిసైడ్ చేసుకుంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. అతనికి రిప్లై ఇచ్చిన డేవిడ్ వార్నర్.. ‘కరెక్ట్‌గా చెప్పావు, నీ అంచనా కరెక్టే...’ అంటూ కామెంట్ చేశాడు.. 

click me!