ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌ను ప్రకటించిన హర్భజన్ సింగ్... విరాట్ కోహ్లీ, యువీలకి దక్కని చోటు...

First Published Nov 7, 2021, 5:24 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా పర్ఫామెన్స్‌తో తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమని తట్టుకోలేకపోయిన భజ్జీ,.. తాజాగా ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌ను ప్రకటించాడు...

41 ఏళ్ల హర్భజన్ సింగ్, టీమిండియా తరుపున చివరిగా 2016 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐదేళ్లుగా భారత జట్టులో చోటు కోసం ఆశగా ఎదురుచూస్తున్న హర్భజన్ సింగ్, ఐపీఎల్‌లోనూ చురుగ్గా కొనసాగుతున్నాడు...

హర్భజన్ సింగ్‌కీ, ఎమ్మెస్ ధోనీకి మధ్య మనస్పర్థలు ఉన్నాయని క్రికెట్ వరల్డ్‌లో టాక్. అయితే తన ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీనే ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్...

భారత ఓపెనర్ రోహిత్ శర్మను తన ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్. ‘హిట్ మ్యాన్’ రోహిత్‌కి టీ20ల్లో దాదాపు 3 వేల పరుగులు, నాలుగు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను మరో ఓపెనర్‌గా సెలక్ట్ చేసుకున్నాడు హర్భజన్. టీ20ల్లో 14 వేలకు పైగా పరుగులు చేసిన గేల్, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు...

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ని తన టీ20 టీమ్‌‌లో వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు భజ్జీ. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన జోస్ బట్లర్, 87 టీ20 మ్యాచుల్లో 2111 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కి హర్భజన్ సింగ్, ఆల్‌టైం బెస్ట్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. 58 టీ20 మ్యాచులు ఆడిన షేన్ వాట్సన్, దాదాపు 1500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 10 హాఫ్ సెంచరీలతో పాటు 48 వికెట్లు కూడా ఉన్నాయి.

సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఏబీ డివిల్లియర్స్‌కి కూడా భజ్జీ, ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. 78 టీ20 మ్యాచులు ఆడిన ఏబీడీ, 1672 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని తన ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గానూ ఎంచుకున్నాడు హర్భజన్ సింగ్. భజ్జీ టీమ్‌లో ఏబీ డివిల్లియర్స్, జోస్ బట్లర్‌లతో కలిపి ముగ్గురు వికెట్ కీపర్లు ఉండడం విశేషం.

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకి హర్భజన్ బెస్ట్ టీ20 టీమ్‌లో ప్లేస్ దక్కింది. టీ20ల్లో 6 వేలకు పైగా పరుగులు, 550 వికెట్లు తీసిన ఏకైక ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు బ్వావో...

క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో‌తో పాటు విండీస్ ఆల్‌రౌండర్లు కిరన్ పోలార్డ్, సునీల్ నరైన్‌లకు కూడా హర్భజన్ సింగ్ జట్టులో చోటు దక్కింది. భజ్జీ టీమ్‌లో విండీస్ ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యం దక్కడం విశేషం...

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రెండో స్థానంలో ఉన్న లసిత్ మలింగకు హర్భజన్ సింగ్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. టీ20ల్లో 107 వికెట్లు తీసిన లసిత్ మలింగ, టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 170 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు మలింగ...

టీమిండియా స్టార్ జస్ప్రిత్ బుమ్రాకి హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్‌లో చోటు దక్కింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా, టీమిండియా తరుపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

అయితే భారత సారథి విరాట్ కోహ్లీకి మాత్రం హర్భజన్ సింగ్ జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. టీ20ల్లో 3227 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే 21 మ్యాచులు ఎక్కువగా ఆడినా 250 పరుగులు తక్కువగా చేశాడు. రోహిత్‌కి ఓపెనర్‌గా చోటు ఇచ్చిన భజ్జీ, విరాట్‌తోతో పాటు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి కూడా తన టీమ్‌లో ప్లేస్ ఇవ్వలేదు...

హర్భజన్ సింగ్ ఆల్‌టైం బెస్ట్ టీ20 టీమ్ ఇదే: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, జోస్ బట్లర్, ఏబీ డివిల్లియర్స్, షేన్ వాట్సన్, ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, కిరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా

click me!