టీ20 వరల్డ్‌కప్‌ 2021లో ఆ జట్టే ఫెవరెట్... ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కామెంట్...

First Published Aug 17, 2021, 4:31 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి సైరన్ ఊదింది ఐసీసీ. పూర్తి షెడ్యూల్ కూడా వచ్చేసింది. దీంతో పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఈసారి టైటిల్ గెలవబోయేది ఎవరు? ఏ జట్టు ఛాంపియన్‌గా నిలస్తుందా? అనే చర్చ మొదలైంది.. ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ విషయాలపై కామెంట్ చేశారు...

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌, దాయాది పాకిస్తాన్‌తో తలబడనుంది. అలాగే ఇంగ్లాండ్ జట్టు, మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను ఎదుర్కోనుంది...

‘నా ఉద్దేశంలో టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియానే ఫెవరెట్. ఎందుకంటే దానికి వాళ్లు అర్హులు. ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. వారికి చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో అంచనా వేసినా... టీమిండియా కంటే బలంగా ఏ జట్టూ కనిపించడం లేదు...

ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి మునుపటిలా లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఆ రేంజ్‌లో సంతృప్తినిచ్చే విజయాలు మేం అందుకోలేకపోయాం...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్...

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాత్రం టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ను టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఫెవరెట్‌గా తెలిపాడు... ‘నాకు తెలిసి టీ20 వరల్డ్‌కప్‌ని గెలవాలంటే పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించాల్సి ఉంటుంది...

ప్రస్తుతం వాళ్లు వరల్డ్ నెం.1 పొజిషన్‌లో ఉన్నారు. అందుకే అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ప్రతీ జట్టూ కూడా పూర్తి సామర్థ్యాలతో టీ20 వరల్డ్‌కప్ బరిలో దిగాలని భావిస్తుంది... మిగిలిన టీమ్‌లు కూడా ముందుగా ఇంగ్లాండ్ జట్టుపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

గ్రూప్ 1లో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకి వెస్టిండీస్ నుంచి బలమైన పోటీ ఉండొచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫామ్ చూస్తే, వాళ్లు సెమీస్ చేరడం కూడా కష్టమే. అయితే వరల్డ్‌కప్‌లో ఆసీస్ పర్ఫామెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం...

గ్రూప్ 2లో ఉన్న టీమిండియాకి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల నుంచి పోటీ విపరీతంగా ఉంటుంది. పాకిస్తాన్‌పై టీమిండియాకి మంచి రికార్డు ఉంది. అయితే అలా అనుకుని, అతి నమ్మకంతో బరిలో దిగి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ బరిలో ఘోరంగా ఓడింది టీమిండియా...

కాబట్టి పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత న్యూజిలాండ్‌ను ఓడించాలి. అయితే  15 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కివీస్ చేతుల్లో వరుసగా ఓడుతూ వస్తోంది టీమిండియా. 2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్... ఇలా హ్యాట్రిక్ టోర్నీల్లో కివీస్ చేతుల్లో ఓడింది...

కాబట్టి ఫేవరెట్స్ జాబితాలో లేకపోయినా కేన్ విలియంసన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేస్తే... భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో యూఏఈలో మంచి అనుభవం ఉంది. 
 

click me!