ఎలా బ్యాటింగ్ చేయాలో షమీని చూసి నేర్చుకో... విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసి...

Published : Aug 17, 2021, 03:13 PM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో మాత్రం భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్... అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా రెండు టెస్టుల్లోనూ మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్‌లో రాణించిన తీరు అసాధారణం...

PREV
19
ఎలా బ్యాటింగ్ చేయాలో షమీని చూసి నేర్చుకో... విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసి...

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 232 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయిన టీమిండియా, 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అంటే ఆఖరి రెండు వికెట్లకీ 46 పరుగులు జోడించారు భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. ఈ పరుగులు ఎంతో అమూల్యమైన 95 పరుగుల ఆధిక్యాన్ని అందించాయి...

29

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం టెయిలెండర్ల నుంచి పెద్దగా ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ రాలేదు... బుమ్రా, షమీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అవుటైన తర్వాత భారత్‌కి పెద్దగా అంచనాల్లేవు...

39

అయితే రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ కలిసి 9వ వికెట్‌కి జోడించిన 89 పరుగుల భాగస్వామ్యం... ఇంగ్లాండ్‌పై నైతిక విజయం సాధించేలా చేసింది. ముఖ్యంగా అండర్సన్, మార్క్ వుడ్, రాబిన్‌సన్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ బ్యాటింగ్ ఆడిన తీరు... వన్డేల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను తలపించింది...

49

70 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన మహ్మద్ షమీ... మూడు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్‌మెన్లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే షమీ ఎక్కువ పరుగులు చేయడం విశేషం..

59

మహ్మద్ షమీ ఇంగ్లాండ్ టూర్‌లో తొలి రెండు టెస్టుల్లో ఓ హాఫ్ సెంచరీతో 69 పరుగులు చేశాడు. జస్ప్రిత్ బుమ్రా 62 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌‌లో హాఫ్ సెంచరీ చేసిన అజింకా రహానే ఒక్కడే 67 పరుగులతో షమీ తర్వాతి స్థానంలో నిలిచాడు...

69

భారత సారథి విరాట్ కోహ్లీ 62 పరుగులతో బుమ్రాతో సమానంగా నిలవగా, ఛతేశ్వర్ పూజారా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 70 పరుగులు మాత్రమే చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. తొలి టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు..

79

దీంతో మరోసారి విరాట్ కోహ్లీపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. విరాట్ కోహ్లీతో పోలిస్తే, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన మహ్మద్ షమీ, ఇంగ్లాండ్ బౌలర్లను నమ్మకంగా ఎదుర్కొన్నాడు... 

89

బౌలర్ ఎవరైనా బాదడమే పనిగా పెట్టుకోకుండా ఓ బ్యాట్స్‌మెన్ ఆడే స్టైల్‌లో డిఫెన్స్ ఆడుతూనే, ఏ బంతిని బౌండరీకి పంపాలో కరెక్టుగా తెలిసినట్టుగా ఆడాడు... జస్ప్రిత్ బుమ్రా కూడా ఎంతో కాన్పిడెంట్‌గా స్ట్రైయిక్ డ్రైవ్ షాట్స్ ఆడాడు... అయితే దురదృష్టవశాత్తు అవి నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న వికెట్లను తాకాయి.

99

మ్యాచ్ జరుగుతున్నా, జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోకుండా నిద్రపోతూ కనిపించే రవిశాస్త్రితో ఫామ్‌ గురించి చర్చించి కంటే... కేవలం మహ్మద్ షమీని చూసి ఎంత నమ్మకంగా బ్యాటింగ్ చేయాలో నేర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories