ఇంగ్లాండ్ కేవలం టూ మ్యాన్ టీమ్‌.. ఇలా అయితే క్లీన్‌స్వీప్ అవుతారు... సునీల్ గవాస్కర్...

First Published Aug 17, 2021, 4:12 PM IST

తొలి టెస్టులో ఓటమి అంచుల దాకా వెళ్లిన ఇంగ్లాండ్ జట్టును వరుణుడు కాపాడు. రెండో టెస్టులో మాత్రం వరుణుడి రాక కోసం ఎంతగా వేడుకున్నా ఫలితం దక్కలేదు. లార్డ్స్ టెస్టులో ఘన విజయం అందుకున్న టీమిండియా... విజయోత్సహంతో మూడో టెస్టుకి రెఢీ అవుతోంది...

d

భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు గెలిచిన తర్వాత వరుసగా మూడు టెస్టుల్లో చిత్తైన ఇంగ్లాండ్ జట్టు... అప్పుడు భారత పిచ్‌లపై తీవ్ర విమర్శలు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆడడానికి ఇబ్బందిపడేలా స్పిన్ పిచ్‌లను రూపొందిస్తున్నారంటూ కామెంట్లు వినిపించాయి...

అయితే ఇంగ్లాండ్‌లోనూ ఇంగ్లాండ్ ఆటతీరు అలాగే ఉంది. ఇండియాలో ఆడిన సిరీస్‌లో స్పిన్ బౌలర్ల బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, స్వదేశంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి కష్టపడుతున్నారు...

మొదటి రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో జో రూట్ ఒక్కడే అదరగొడుతూ రాణిస్తుంటే... బౌలింగ్‌లో ఆ బాధ్యత సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తీసుకున్నాడు. దీనిపై కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

‘ఇంగ్లాండ్ జట్టు మరీ ఇద్దరు ప్లేయర్ల టీమ్‌లా ఆడుతోంది. వాళ్లు జో రూట్, జేమ్స్ అండర్సన్. ఈ ఇద్దరూ మాత్రమే ఆడుతున్నారు. అలాగని ఇంగ్లాండ్‌ను అవమానించడం లేదు... 

ఇంగ్లాండ్‌‌కి ఆడుతున్న 11 మంది ప్లేయర్లపైన నాకెంతో గౌరవం ఉంది. అయితే మిగిలినవాళ్లెవ్వరూ టెస్టు మ్యాచులు ఆడుతున్నట్టుగా కనిపించడం లేదు... ఇంగ్లాండ్‌కి సరైన టెస్టు టీమ్ తయారుచేయడానికి సమయం పడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

‘ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఏ మాత్రం టెక్నిక్ కనిపించడం లేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. నెం. 3లో వచ్చిన హసీబ్ హమీద్ చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో ఇబ్బందిపడుతున్నాడు...

జానీ బెయిర్ స్టో, చాలా బాగా ఆడుతున్నాడు. అయితే అతను వైట్ బాల్ క్రికెటర్, టెస్టులకు సరిగ్గా సూట్ అవ్వడని అతని బ్యాటింగ్ చూస్తేనే తెలుస్తోంది. బౌండరీలు వస్తున్నంత సేపు క్రీజులో ఉంటాడు, లేదా అవుటై పెవిలియన్‌కి వెళ్లిపోతాడు...

బట్లర్ కూడా అంతే... జోస్ బట్లర్‌కి టెస్టుల్లో చోటు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు... అతను పూర్తిగా టీ20, వన్డే ఫార్మాట్ ప్లేయర్... ఇక బౌలింగ్ విభాగంలోనూ అంతే...

జేమ్స్ అండర్సన్ ఒక్కడూ విజయం కోసం ఏం చేయాలో అంతా చేస్తున్నాడు. రాబిన్‌సన్‌కి ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఐదు వికెట్లు దక్కాయి. కానీ ఆ తర్వాత అతని నుంచి సరైన ప్రదర్శన రాలేదు..

బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టడం రాబిన్‌సన్‌కి ఇంకా తెలియడం లేదు. అతనికి అంత అనుభవం కూడా లేదు. ఇలాగే ఆడితే టీమిండియా ఈజీగా 4-0 తేడాతో సిరీస్ గెలుస్తుంది. లేదా 3-1 తేడాతో గెలవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఇండియాతో టెస్టు సిరీస్ నుంచి తప్పుకోగా... స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మానసిక ఆరోగ్యం కోసం క్రికెట్ నుంచి రెస్టు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు..

మరో స్టార్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా గాయపడ్డాడు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ తీయకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్‌ను అవుట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్... ఫిట్‌గా ఉండి ఉంటే లార్డ్స్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చేవాడని ఇంగ్లాండ్ భావిస్తోంది...

click me!