కోచ్‌ పొజిషన్‌లో ఉండి ఇలా సాకులు చెప్పకండి, ఇప్పటికైనా దాన్ని ఒప్పుకోండి... - హర్భజన్ సింగ్ ...

First Published Nov 8, 2021, 3:59 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఆడి మొదటి రెండు మ్యాచుల్లో ఓడింది. పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిన విరాట్ సేన, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఏ మాత్రం ఇష్టం లేనట్టుగా ఆడింది. భారత జట్టు ప్రదర్శనపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 

పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోవడం టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడినా, వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయినా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ల కారణంగా 150+ పరుగుల స్కోరు చేసింది టీమిండియా...

అయితే బౌలింగ్‌లో భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో పాకిస్తాన్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది...

‘టోర్నీ ఆరంభంలో టాస్‌లు ఓడిపోవడం జట్టు పర్ఫామెన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఐపీఎల్‌ అయ్యాక ఓ వారం రోజులు గ్యాప్ ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

‘టీమిండియా టాస్ గెలిచి ఉంటే అలా ఆడేది, ఇలా ఇరగదీసేది అంటూ భరత్ అరుణ్ చేసిన కామెంట్లు విన్నాను. ఆ విషయాన్ని పక్కనబెట్టండి. మొదట బౌలింగ్ చేయాలనుకున్నా, బ్యాటింగ్ చేయాలనుకున్నా... ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బీతో రెఢీగా ఉండాలి కదా...

ఐపీఎల్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. ఈజీగా 190 పరుగులు చేసి, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. భారత జట్టుకి అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ లేదా...

కాబట్టి ఇకనైనా టీమిండియా పరాజయానికి సాకులు వెతకడం ఆపేసి, బాగా ఆడలేకపోయామని ఒప్పుకోండి.. కోచ్ పొజిషన్‌లో ఉండి టాస్ గెలిచి ఉంటే, మ్యాచ్ గెలిచేవాళ్లం అని చెప్పడం హ్యాస్యాస్పదంగా ఉంటుంది...

టాస్ గెలవకపోయినా మ్యాచులు గెలిచిన టీమ్‌లు, ఈ టోర్నీలోనే ఉన్నాయి. జట్టు బలంగా లేని వాళ్లే ఇలాంటి మాటలు చెబుతారు. వరల్డ్ క్లాస్ క్రికెటర్లతో నిండిన టీమిండియా ఇలాంటి మాటలు చెప్పడం సరికాదు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా సరిగా ఆడలేదు. అదేం పెద్ద సమస్య కాదు, మున్ముందు చాలా టోర్నీలు ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా టీ20 వరల్డ్‌కప్ జరగబోతోంది...

కాబట్టి చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి వాటిని ఉపయోగించుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...

click me!