IPL 2022: రాజస్థాన్ రాయల్స్ కు షాకివ్వనున్న సంజూ శాంసన్..? ఏకంగా ఆ జట్టుకే గురి పెట్టాడుగా..

First Published Nov 8, 2021, 3:38 PM IST

Sanju Samson: 2022 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజూ శాంసన్ భావిస్తున్నాడట. సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ పేజీలను అన్ లైక్ చేసిన సంజూ శాంసన్.. ఎందులో చేరుతాడనేది ఇప్పడు ఆసక్తికరం. 

వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-15 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్ తగలనుందా..? ఆ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న కెప్టెన్ సంజూ శాంసన్ ఆ షాక్ ఇవ్వనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  

2022 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజూ శాంసన్ భావిస్తున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో శాంసన్.. రాజస్థాన్ రాయల్స్ ను అన్ ఫాలో చేయడమే దీనికి సాక్ష్యమని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. 

అయితే రాజస్థాన్ రాయల్స్ ను అన్ ఫాలో చేసిన శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)  పేజీలను ఫాలో అవుతుండటం గమనార్హం. ఈ సీజన్ విజేత అయిన సీఎస్కేతో వెళ్లాలని సంజూ శాంసన్ భావిస్తున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం సీఎస్కేలో సారథి ఎంఎస్ ధోనినే వికెట్ కీపింగ్ బాధ్యతలు చూస్తున్నాడు. వచ్చే సీజన్ లో ధోని ఆటగాడిగా ఉంటాడో లేక మెంటార్ గా ఉంటడోననే విషయంపై ఇంకా సందిగ్దం వీడలేదు. అయితే  ధోని ప్లేస్ ఖాళీ అయితే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శాంసన్ చూస్తున్నాడు.  2022 లో సీఎస్కేకు కెప్టెన్ గా ఎవరున్నా తనకు మాత్రం వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటర్  గా సుస్థిరస్థానం సంపాదించుకోవాలనేది శాంసన్ ప్లాన్. మరి ఈ ప్లాన్ ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాలంటే జనవరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం దాకా వేచి చూడాల్సిందే. 

2013లో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగ్రేటం చేసిన సంజూ.. 2015 దాకా ఆడాడు. 2016-18 దాకా ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ  క్యాపిటల్స్) తరఫున బరిలోకి దిగాడు. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో నిషేధం ఎదుర్కొంది. 

2018లో రాజస్థాన్ మళ్లీ ఐపీఎల్ లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి శాంసన్ రాజస్థాన్ తో చేరాడు. 2021 సీజన్ కు గాను శాంసన్ రాజస్థాన్ కు కెప్టెన్ అయ్యాడు. ఇటీవలే ముగిసిన 14వ  ఐపీఎల్ సీజన్ లో శాంసన్ 14 మ్యాచులలో 484 పరుగులు చేశాడు.

కెప్టెన్ గా ఉన్నప్పటికీ శాంసన్ పెద్దగా సాధించిందేమీ లేదు. బ్యాటర్ గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్ గా మాత్రం అతడు విఫలమయ్యాడు. దీంతో రాజస్థాన్ ను వీడి చెన్నైతో చేరాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 

click me!