సెలక్టర్ల చేతకానితనం వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి... ఒక్కడూ ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన వాడు లేడు...

Published : Nov 13, 2021, 01:58 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఫెవరెట్ టీమ్‌గా వెళ్లింది టీమిండియా. వార్మప్ మ్యాచుల్లో భారత జట్టు ఆడిన తీరు చూసి, ఎవ్వడూ టీమిండియాను ఆపలేడని ఆనందపడ్డారు టీమిండియా ఫ్యాన్స్. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 

PREV
112
సెలక్టర్ల చేతకానితనం వల్లే టీమిండియాకి ఈ పరిస్థితి... ఒక్కడూ ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన వాడు లేడు...

మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో, ఆ తర్వాత వారం రోజులకి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంది భారత జట్టు... ఇది కోచ్‌గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఆఖరి టోర్నీ..

212

ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో టీ20 వరల్డ్‌కప్ గెలిచి, ఐసీసీ టైటిల్‌తో కెరీర్ ముగించాలని భావించిన కోచ్‌గా రవిశాస్త్రి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీలకి ఆశించిన ఫలితం దక్కలేదు..

312

టీమిండియా హెడ్ కోచ్‌గా కాంట్రాక్ట్ గడువు పూర్తిచేసుకున్న రవిశాస్త్రి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి...

412

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో పాటు ఏ సిరీస్‌కి అయినా జట్టుని పూర్తిగా సెలక్టర్లే ఎంపిక చేస్తారని, వారు తీసుకున్న 15 మందిలో ఏ 11 మందిని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలనేది మాత్రమే కోచ్‌గా తన చేతుల్లో, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చేతుల్లో ఉంటుందని కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

512

టీమ్ సెలక్షన్ విషయంలో సెలక్టర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయం, అభిప్రాయం కూడా తీసుకోరని రవిశాస్త్రి చేసిన కామెంట్లు, భారత క్రికెట్‌లో తీవ్ర దుమారం రేపేలా కనిపిస్తున్నాయి...

612

‘జాతీయ జట్టుకి ఆటగాళ్లను ఎంపిక చేసే ప్లేయర్లకు అన్ని ఫార్మాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ గురించి తెలిసినవాళ్లే, అందులో ఏ ప్లేయర్‌ని రాణించగలడో అర్థం చేసుకోగలుగుతాడు...

712

టీ20 క్రికెట్ గురించి తెలియనివాళ్లు, లీగ్ క్రికెట్, జాతీయ జట్టుకి ఆడడం రెండూ ఒక్కటే అనుకుంటారు. ఆ రెండింటి మధ్య తేడా తెలియాలంటే టీ20లు ఆడిన అనుభవం ఉండాలి..’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్...

812

భారత సెలక్షన్ కమిటీలో ఉన్న ఏ ఒక్కరికీ ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన అనుభవం లేకపోవడం విశేషం. 1994లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన చేతన్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

912

అలాగే సెలక్షన్ కమిటీలోని ఏబీ కురువిల్లా, సునీల్ జోషి, హర్విందర్ సింగ్, దెబషిస్ మోహంటీ వంటి వాళ్లు టీ20 ఫార్మాట్ రాకముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నవారే కావడం విశేషం...

1012

వీరిలో సునీల్ జోషి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే కింద అసిస్టెంట్‌గా పనిచేస్తే, ఏబీ కురువిల్లా, ముంబై ఇండియన్స్ జట్టుకి టాలెంట్ స్కాట్ స్వార్డ్‌లో పనిచేసిన అనుభవం సంపాదించాడు...

1112

ఏ మాత్రం టీ20 అనుభవం లేనివాళ్లు టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడమే భారత జట్టు ఓటమికి కారణమని, దీనికి పూర్తి బాధ్యత బీసీసీఐయే తీసుకోవాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

1212

టీ20ల్లో మంచి రికార్డు ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ని ఎంపిక చేయకపోవడం, సీనియర్లు శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లను పక్కనబెట్టడం, ఫిట్‌గా లేని హార్దిక్ పాండ్యాని ఆడించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories