బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్ బాదినా విరాట్ కోహ్లీ రికార్డు సేఫ్... ఇర్ఫాన్ పఠాన్, హజల్‌వుడ్ సేమ్ టు సేమ్...

First Published Nov 14, 2021, 11:38 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే టోర్నీకి ముందు ఫామ్‌లో లేకపోయినా, వరల్డ్‌కప్ మొదలయ్యాక దుమ్మురేపే ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియాని ఫైనల్‌కి చేర్చాడు. అయినా విరాట్ కోహ్లీ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో 6 మ్యాచలులు ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 60.60 సగటుతో 303 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, ఏడు ఇన్నింగ్స్‌ల్లో 289 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. వార్నర్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు మాత్రం ఈ ఇద్దరూ బ్రేక్ చేయలేకపోయారు...

2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆరు మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 106.33 సగటుతో 319 పరుగులు చేశాడు. ఓ టీ20 వరల్డ్‌కప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు...

జోష్ హజల్‌వుడ్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్ కూడా బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి 16 పరుగులే ఇవ్వడం విశేషం. ఈ రెండుసార్లూ ఆయా జట్లకి తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ దక్కడం కొసమెరుపు.

ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇది ఏడో సీజన్ కాగా, ఏడు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా. ఆసీస్ టాప్ స్కోరర్ మిచెల్ మార్ష్ 77 పరుగులు చేయడం మరో విశేషం...

టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, అండర్‌19 వరల్డ్‌కప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న రెండో క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్. ఇంతకుముందు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంతకుముంద ఈ ఘనత అందుకున్నాడు...
అక్టోబర్ 15న ఐపీఎల్ టైటిల్ గెలిచిన సభ్యుడిగా ఉన్న జోష్ హజల్‌వుడ్, నవంబర్ 15న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన టీమ్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు. 

ఫైనల్‌లో 77 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌’గా ఎంపికయ్యారు. 2007లో ఇర్ఫాన్ పఠాన్, 2009లో షాహిదీ ఆఫ్రిదీ, 2010లో క్రెగ్ కిస్వెట్టర్, 2012లో మార్లన్ సామూల్స్, 2014లో కుమార సంగర్కర, 2016లో సామూల్స్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’గా నిలిచాడు మిచెల్ మార్ష్. 


టోర్నీలో 289 పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు.  2007లో షాహిదీ ఆఫ్రిదీ, 2009లో దిల్షాన్, 2010 కేవిన్ పీటర్సన్, 2012లో షేన్ వాట్సన్, 2014, 2016 టోర్నీల్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీమెంట్ గెలవగా, డేవిడ్ వార్నర్ వారి సరసన నిలిచాడు

click me!