2007 వన్డే వరల్డ్‌కప్ పర్ఫామెన్స్‌ను రిపీట్ చేసిన భారత జట్టు... టీమిండియాపై ఐపీఎల్ ఎఫెక్ట్...

First Published Oct 31, 2021, 10:42 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే... గ్రూప్ 2లో టీమిండియాకి ఇంకా మూడు మ్యాచులు మిగిలి ఉన్నా, వాటిల్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోయినా... భారత జట్లు ప్లేఆఫ్స్ చేరడం చాల కష్టం...

గత ఏడాది కాలంలో భారత జట్టు సాధించిన విజయాలు, టీమిండియాపై భారీ అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. కోహ్లీ కెప్టెన్సీలో గత 10 టీ20 సిరీస్‌ల్లో గెలిచింది భారత జట్టు...

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా మొదటి, చివరి టీ20 వరల్డ్‌కప్ కావడంతో భారత జట్టుపై అంచనాలు ఆకాశానికి అంటాయి. అయితే మళ్లీ భారత జట్టు పాత పర్ఫామెన్స్‌నే పునరావృత్తం చేసింది...

మొదటి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడం టీమిండియాకి ఇదే మొదటిసారి...

2007 వన్డే వరల్డ్‌కప్ టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా మొదలెట్టింది టీమిండియా. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓడి, క్వార్టర్ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది... అప్పుడు భారత జట్టుపై అంచనాలే టీమ్ పర్ఫామెన్స్‌ను దెబ్బతీశాయి...

ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, దినేశ్ కార్తీక్ వంటి యంగ్ ప్లేయర్ల రాకతో భారత జట్టు సంచలనాలు చేస్తుందని ఆశించారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ అంచనాలే టీమిండియాను దెబ్బతీశాయి...

ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి యంగ్ ప్లేయర్లు అదరగొడుతుండడంతో టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా టోర్నీని ఆరంభించింది...

2007 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలాగే వీరిపై కూడా ఉన్న ఆ భారీ అంచనాలే వారి పర్ఫామెన్స్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. సిక్సర్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలెట్టిన సూర్యకుమార్ యాదవ్, బౌండరీతో ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ తెరిచిన ఇషాన్ కిషన్... కీలక మ్యాచుల్లో ఫెయిల్ అయ్యారు...

ఐపీఎల్ పర్ఫామెన్స్ చూసి, టీ20 వరల్డ్‌కప్ లాంటి కీలక టోర్నీలకు ప్లేయర్లను ఎంపిక చేయడం, టీమిండియా పర్ఫామెన్స్‌ని తీవ్రంగా దెబ్బతీసింది...

ఎన్నో ఏళ్లుగా ఓపెనర్‌గా ఆకట్టుకుంటున్న శిఖర్ ధావన్‌కి, మ్యాచ్ విన్నర్‌గా మారిన యజ్వేంద్ర చాహాల్‌ను పక్కనబెట్టడం టీమిండియా పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...

ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వంటి అంతర్జాతీయ అనుభవం లేని బౌలర్‌ని, ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా జట్టులోకి తీసుకోవడం, అతను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతని మిస్టరీ మొత్తం వికెట్ల వెనకాల నుంచి సలహాలు ఇచ్చే దినేశ్ కార్తీక్‌దేనని తేలిపోయింది. 

ఒత్తిడిని ఎదుర్కోలేక ఓడిపోవడం ఇప్పుడే కొత్తగా జరిగింది కానీ... ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా కీ మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ వస్తోంది టీమిండియా... ప్రెషర్‌ను ఎలా ఫేస్ చేయాలో భారత ప్లేయర్లకు తెలియడం లేదు...

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా ఆడడం విరాట్ కోహ్లీకి అలవాటు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ నుంచి వచ్చిన పర్ఫామెన్స్ అలాంటిదే...

అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 11 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేకపోయారు భారత బ్యాట్స్‌మెన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన రవీంద్ర జడేజా కానీ, వరుసగా రెండు సీజన్లలో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కానీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆకట్టుకోలేకపోయారు...

టీ20 వరల్డ్‌కప్ ముందు ఐపీఎల్ ఆడడం భారత జట్టు పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది. నెల రోజుల పాటు బయో బబుల్‌లో గడపడం, వరుసగా మ్యాచులు ఆడడంతో భారత ఆటగాళ్లు అలసిపోయినట్టు కనిపించారు...

ఐపీఎల్‌ ఆడని పాకిస్తాన్ ప్లేయర్లు ఇచ్చిన పర్ఫామెన్స్, ఐపీఎల్‌కి రాని ఆసీస్, ఇంగ్లాండ్ ప్లేయర్ల పర్ఫామెన్స్ చూస్తుంటే... నిజంగానే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు సెకండ్ ఫేజ్‌ని నిర్వహించడం మనోళ్ల పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది...

click me!