పాకిస్తాన్‌పై గెలిచేశాం, ఇక టీ20 వరల్డ్‌కప్ మనదే... స్టువర్ట్ బ్రాడ్ కామెంట్...

First Published Jul 22, 2021, 1:49 PM IST

మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఊహించని పరాజయం తర్వాత అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి, సిరీస్ సొంతం చేసుకుంది. టీ20 నెం.1 టీమ్‌గా ఉన్న ఇంగ్లాండ్ జట్టు, టీ20 వరల్డ్‌కప్ గెలుస్తుందని కామెంట్ చేశాడు ఆ దేశ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్...

గత ఆరేళ్లలో ఇంగ్లాండ్ జట్టు, మూడంటే మూడు సార్లు మాత్రమే టీ20 సిరీస్ కోల్పోయింది. 2017లో, 2018లో, 2021లో భారత జట్టు చేతుల్లోనే టీ20 సిరీస్ ఓడిన ఇంగ్లాండ్, మిగిలిన జట్లపై తిరుగులేని ఆధిపత్యం చూపించింది...
undefined
వరుసగా రెండు టీ20మ్యాచుల్లో గెలిచి, సిరీస్ సొంతం చేసుకున్న మోర్గాన్ సేన, ట్రోఫీని లిఫ్ట్ చేయడం చూస్తుంటే... టీ20 వరల్డ్‌కప్ కూడా గెలువబోతున్నట్టు అనిపిస్తోందంటూ ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్ చేశాడు.
undefined
‘మోర్గాన్ ట్రోఫీ ఎత్తడం చూస్తుంటే, ఈసారి మనమే వరల్డ్‌కప్ గెలవబోతున్నామని అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్. అయితే బ్రాడ్ కామెంట్లపై విండీస్, ఇండియా క్రికెటర్ల నుంచి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది.
undefined
‘స్టువర్ట్ బ్రాడ్ కమెడియన్‌గా మారాడని నాకు తెలీదు, అన్ని జట్లకీ ఆల్ ది బెస్ట్, చూద్దాం ఎవరు గెలుస్తారో...’ అంటూ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో ట్వీట్ చేశాడు...
undefined
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌ను విండీస్ 4-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే...
undefined
భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ కూడా స్టువర్ట్ బ్రాడ్ కామెంట్లపై ఫన్నీగానే స్పందించాడు. ‘ఇంగ్లాండ్ జట్టు, సొంత ప్లేయర్లు ‘కమ్మింగ్ హోమ్’ అని చెప్పడం వల్లే ఎక్కువగా నష్టపోతుందని అనుకుంటా.. ఇప్పుడు కూడా ట్రోఫీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా... అలాగే చెబుతున్నారు.’ అంటూ ట్వీట్ చేశాడు మురళీ కార్తీక్...
undefined
అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ 1లో ఉండడంతో మంచి రసవత్తర పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్న విషయం తెలిసిందే.
undefined
click me!