ధోనీ కాదు, దీపక్ చాహార్ ఇన్నింగ్స్‌కి విరాట్ కోహ్లీయే కారణం... రాహుల్ ద్రావిడ్ కామెంట్...

First Published Jul 22, 2021, 11:21 AM IST

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బౌలర్ దీపక్ చాహార్, బ్యాటుతోనూ దుమ్మురేపి టీమిండియాకి అద్భుత విజయాన్ని అందించాడు. అయితే చాహార్ ఇన్నింగ్స్‌ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌కి ఓ అలవాటు ఉంది. అదే ప్రపంచంలో ఏ క్రికెటర్ రాణించినా, దానికి కారణం మాహీయే అని చెప్పడం...
undefined
ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్ సామ్ కుర్రాన్ శ్రీలంకపై ఆల్‌రౌండ్ షోతో మ్యాజిక్ చేసినా, సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది రాణించినా అది మహీ మహిమేనంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశారు ధోనీ వీరాభిమానులు...
undefined
తాజాగా రెండో వన్డేలో దీపక్ చాహార్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అతను సీఎస్‌కేలో ఆడడం వల్ల, మాహీ నుంచి నేర్చుకున్నాడని... లేకపోతే అలాంటి ఇన్నింగ్స్ ఆడేవాడు కాదని సోషల్ మీడియాలో తెగ ఊదరకొడుతున్నారు.
undefined
అయితే దీపక్ చాహార్ మాత్రం తన ఇన్నింగ్స్ క్రెడిట్‌ మొత్తం కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి ఇచ్చేశాడు. ‘నేను బ్యాటింగ్ చేయగలనని ద్రావిడ్ సర్ నమ్మారు. అందుకే భువీ కంటే ముందు నన్ను బ్యాటింగ్‌కి పంపారు’ అంటూ చెప్పుకొచ్చాడు దీపక్ చాహార్.
undefined
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కానీ, తన ఐపీఎల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి కానీ మాటవరకూ కూడా ఒక్క మాట చెప్పలేదు దీపక్ చాహార్..
undefined
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీపక్ చాహార్ ఇన్నింగ్స్ క్రెడిట్ మొత్తం రాహుల్ ద్రావిడ్‌దేనంటూ ఓ మీమీని పోస్టు చేశారు...
undefined
అయితే శ్రీలంక టూర్‌లో భారత కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ మాత్రం దీపక్ చాహార్ ఇన్నింగ్స్‌కి విరాట్ కోహ్లీకి కూడా క్రెడిట్ దక్కాలని కామెంట్ చేయడం విశేషం...
undefined
‘దీపక్ చాహార్ ఇన్నింగ్స్‌కి విరాట్ కోహ్లీకి కూడా క్రెడిట్, అభినందనలు దక్కాలి. ఎందుకంటే ఆఖరి క్షణం వరకూ గెలుపు కోసం పోరాడే కసిని కోహ్లీ, తన జట్టు ప్లేయర్లలో నింపాడు. విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన ఈ పట్టుదలే, భారత జట్టు విజయానికి కారణం...’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్...
undefined
click me!