Rohit Sharma-Virat Kohli : అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8కి అర్హత సాధించింది. భారత్ రెండో రౌండ్‌కు చేరినా.. ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పెద్దగా తమ ప్రత్యేకతను చూపించలేకపోయారు.
ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి 10 పరుగులు కూడా చేయలేదు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, మిగిలిన మ్యాచ్‌లలో ఫ్లాప్ అయ్యాడు. ఈ క్రమంలోనే సూపర్-8లో కూడా అదే ఓపెనింగ్ జోడీతో భారత్ వెళ్తుందా అనేది ప్రశ్న. ఎందుకంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం.
ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మల ఓపెనింగ్ బ్యాటింగ్ జోడీలో ఎలాంటి మార్పులు చేయకూడదని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
ఓపెనింగ్ జోడీని మార్చడం వల్ల భారత బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చెడిపోతుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకు ఈ స్టార్లు ఇద్దరు ఓపెనింగ్ జోడీగా రావడంతో మిగతా ప్లేయర్లు కూడా తమ స్థానాలకు అలవాటు పడ్డారనీ, ఇప్పుడు మార్పులు చేస్తే ఇతర ఈ జోడీతో పాటు ఇతర ప్లేయర్లపై ఒత్తిడిపడే అవకాశముందని పేర్కొన్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ చెడిపోకుండా యశస్వి జైస్వాల్ ను ఆడించాలని చూస్తే అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్ కు తీసుకురావచ్చనీ, దీంతో రిషబ్ పంత్ నాలుగో స్థానం బ్యాటింగ్ ఆర్డర్ లోకి వెళ్తాడని చెప్పాడు. ఇది జట్టు కూర్పుపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదన్నాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బపడే అకాశం ఉంది కాబట్టి ఇలాంటి మార్పులు చేయరని తాను అనుకుంటున్నానని చెప్పాడు.
Virat Kohli, RohitSharma
ప్రస్తుతం రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 'రిషబ్ మూడో స్థానంలో మంచి ప్రదర్శన కనబరిచాడు. సూర్యకుమార్ కూడా తన బ్యాట్ పదును చూపించాల్సిన అవసరముంది. వెస్టిండీస్ పిచ్ పరిస్థితులు గమనిస్తే పవర్‌ప్లేలో మంచి పరుగులు రావాలంటే కోహ్లీ-రోహిత్ లతో ఓపెనింగ్ ఫలితాలు ఇస్తాయని కూడా జాఫర్ పేర్కొన్నాడు.
ఆతిథ్య అమెరికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత భారత్ సూపర్ 8కి అర్హత సాధించింది. భారత్ ఇప్పుడు జూన్ 20న బార్బడోస్‌లో ఫామ్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది. ఇది కరేబియన్‌లో వారి మొదటి మ్యాచ్ కూడా. ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ న్యూయార్క్‌లోనే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పిచ్‌పై ఆడడం భారత్‌కు సవాల్‌గా మారనుంది.