T20 World Cup 2024
T20 World Cup 2024 - India : అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి 29 వరకు జరుగుతుందని ఐసీసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, నేపాల్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, నమీబియా, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండా, కెనడా జట్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడనున్నాయి.
T20 World Cup 2024
అయితే, వీటిలో భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే అమెరికాలో జరుగుతాయి. భారత్ మ్యాచ్ లను వెస్టిండీస్ లో కాకుండా యూఎస్ఏలో ఎందుకు పెట్టారు అనే ప్రశ్న రావచ్చు. దీనికి ప్రధాన కారణాలు గమనిస్తే.. అమెరికాలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు టీ20 ప్రపంచకప్ 2024ను అమెరికాలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అమెరికన్ క్రికెట్ జట్టు దానికంటే చిన్న జట్టును కూడా ఓడించేంతగా ఎదగలేదు.
Virat Kohli
అందువల్ల అమెరికా జట్టుతో అమెరికాలో జరిగే ప్రపంచ కప్ ను ప్రాచుర్యంలోకి తేవడం సాధ్యం కాదు. దీంతో సగం సిరీస్ ను వెస్టిండీస్ లో, సగం సిరీస్ ను అమెరికాలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండటంతో భారత జట్టుతో కలిసి అమెరికాలో వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించి భారత్ ఆడే లీగ్ దశ మ్యాచ్ లకు షెడ్యూల్ ను సిద్ధం చేసింది.
Virat Kohli
తాజా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ లో భారత్, పాకిస్థాన్ రెండూ ఒకే గ్రూపులో ఉండగా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలు కూడా అదే గ్రూపులో ఉన్నాయి. దీంతో భారత్, పాకిస్థాన్ జట్లు మాత్రమే సూపర్ 8 దశకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Rohit Sharma, cricket
టోర్నీలోని మొత్తం 20 జట్లను గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ అనే నాలుగు గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంచారు. గ్రూప్ దశ జూన్ 1 నుంచి 18 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి కేటగిరీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 రౌండ్ కు చేరతాయి. సూపర్ 8 రౌండ్ ను 2 విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 రౌండ్ జరగనుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
India cricket 2024
జూన్ 26, 27 తేదీల్లో తొలి, రెండో సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. జూన్ 1న గ్రూప్-ఏలో అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డల్లాస్ లో జరుగుతోంది.
ICC, T20 World Cup, india, cricket
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు ఆడే మ్యాచ్ లు:
జూన్ 5 - భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)
జూన్ 9 - భారత్ వర్సెస్ పాకిస్థాన్ (న్యూయార్క్)
జూన్ 12 - ఇండియా వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్)
జూన్ 15 - ఇండియా వర్సెస్ కెనడా (లాడర్ హిల్-ఫ్లోరిడా)