David Warner Test Retirement: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్ కు గ్రాండ్ గా చెప్పాడు. తాను సిడ్నీలో ఆడిన చివరి టెస్టు మ్యాచ్ లో బ్యాట్ తో రాణించి ఆసీస్ కు విజయం అందించాడు. పాకిస్తాన్ తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో ఆసీస్ పాక్ ను చిత్తుచేసి వార్నర్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే వీడ్కోలు అందించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని డేవిడ్ వార్నర్ ఇదివరకే ప్రకటించి వార్నర్.. పాకిస్తాన్ తో సిడ్నీలో చివరి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్ సెంకండ్ ఇన్నింగ్స్ లో వార్నర్ 57 పరుగులు చేశాడు.
సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు విజయం తర్వాత కామెంటేటర్ డేవిడ్ వార్నర్ ను ఇంటర్వ్యూ కోసం సంప్రదించగా.. మాట్లాడుతూనే వార్నర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కళ్ల నుంచి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ డేవిడ్ వార్నర్ హఠాత్తుగా అక్కడి నుంచి వెనుదిరిగి సహచరుల వద్దకు వెళ్లాడు.
డేవిడ్ వార్నర్ మైదానంలో తన భార్యను కౌగిలించుకుంటూ కనిపించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భార్యను కౌగిలించుకున్న అనంతరం డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా తన ముగ్గురు కూతుళ్లను కౌగిలించుకుని కనిపించాడు. డేవిడ్ వార్నర్ కు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2009 నుంచి ఆస్ట్రేలియా జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్, డిసెంబర్ 1, 2011న న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తో చివరి టెస్టు మ్యాచ్ ను 2024లో ఆడాడు.
David Warner
ఇప్పటి వరకు 112 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే, వార్నర్ మూడు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. మొత్తం క్రికెట్ అభిమానులను మైదానంలోకి అనుమతించి వార్నర్‌కు ప్రత్యేక గౌరవం అందించింది ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్.
David Warner Farewell Test
డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు 3-0 విజయం సాధించిపెట్టింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయం ఇక్కడకు వచ్చి టెస్టును 3-0తో ముగించడం గొప్ప విజయం. గొప్ప క్రికెటర్లతో ఇక్కడ ఉన్నందుకు గర్విస్తున్నాను. ఆసీస్ ఆటగాళ్లు నెట్స్‌లో, జిమ్‌లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని తెలిపాడు.
తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. మాది అందమైన కుటుంబం. నేను వారితో గడిపిన ప్రతి సెకనును విలువైనదిగా భావిస్తాను. నేను వారిని జీవితాంతం వరకు ప్రేమిస్తాను.. మీరు చేసే పనికి ధన్యవాదాలు కాండిస్, మీరు నాకు ప్రపంచం అని అర్థం అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.