సింహం వేటడడం మానేసినంత మాత్రాన, గుంటనక్కలు అడవిని ఏలలేవు... విరాట్‌పై ఆర్‌పీ సింగ్...

First Published Nov 4, 2022, 12:22 PM IST

టైమ్ బాగున్నప్పుడు ఆహో... ఓహో... అని పొడుగుతూ చుట్టూ తిరిగినవాళ్లే, పరిస్థితులు కాస్త తేడా కొడితే... ముఖం చాటేస్తారు. కొన్నిసార్లు ఇది రివర్స్ కూడా అవుతుంది. టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో కోహ్లీకి ప్లేస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని వాదించిన వాళ్లే, ఇప్పుడు విరాట్ ఆడుతున్న ఇన్నింగ్స్‌లను వేనోళ్ల పొగుడుతున్నారు...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరోచితంగా ఆఖరి వరకూ పోరాడి టీమిండియాకి అద్భుత విజయం అందించిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకి భారీ స్కోరు అందించి, టోర్నీలో రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...

Virat Kohli

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీకి టీ20 టీమ్‌లో చోటు ఇవ్వడం కూడా వేస్ట్ అని టాక్ వినబడింది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటు ఆర్పీ సింగ్, పార్థివ్ పటేల్ లాంటి మాజీ క్రికెటర్లు... విరాట్‌ని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించడం కూడా వేస్ట్ అన్నారు..

Image credit: Getty

అప్పుడు విమర్శించిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్‌పీ సింగ్... ఇప్పుడు విరాట్ కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘గ్రద్ధ రెండు రోజులు ఎగరనంత మాత్రాన, పావురాలు ఆకాశానికి ఎగరలేవు... సింహాం రెండు రోజులు వేటాడనంత మాత్రం గుంట నక్కలు, అడవిని ఏలలేవు... అలాగే విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనంత మాత్రం మిగిలిన వాళ్లు కింగ్ కాలేరు...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌పీ సింగ్...

virat

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు మూడేళ్ల పాటు సెంచరీ చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ. ఇదే సమయంలో జో రూట్ టెస్టుల్లో రికార్డు స్థాయిలో సెంచరీల మోత మోగించి, పరుగుల ప్రవాహం క్రియేట్ చేశాడు. అలాగే వన్డే, టీ20ల్లో బాబర్ ఆజమ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌కి ఎగబాకాడు...

Image credit: Getty

అయితే బాబర్ ఆజమ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో డబుల్ డిజిట్ స్కోరు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే... జో రూట్, వరల్డ్ కప్ టీమ్‌లోనే చోటు దక్కించుకోలేకపోయాడు. కేన్ విలియంసన్ పెద్దగా మెప్పించలేకపోగా... స్టీవ్ స్మిత్ తుది జట్టులోకి కూడా రాలేకపోయాడు...

RP Singh

ఫ్యాబ్ 4లో ఒక్క విరాట్ కోహ్లీ ఒక్కడే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తన రేంజ్ పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు. విరాట్‌తో పోల్చినవాళ్లు, పోటీపడినవాళ్లు ఎవ్వరూ కూడా అతనిలా రాణించలేకపోతున్నారు. దీన్ని ఆర్‌పీ సింగ్ ఈ విధంగా పోల్చి కామెంట్ చేశాడు.. 

click me!