ఈ రికార్డులను కొట్టేదెవరు? పడగొట్టేదెవరు... టీ20 వరల్డ్ కప్ 2022లో టాప్ రికార్డులు ఏవంటే...

First Published Oct 14, 2022, 1:40 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 మెగా టోర్నీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు టైటిల్ కోసం పోటీపడబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్, పాకిస్తాన్, టీమిండియా జట్లు టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగబోతున్నాయి. ఈసారి కొన్ని రికార్డులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి...

Yuvraj Singh

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఇది జరిగి 15 ఏళ్లు గడుస్తున్నా యువీ రికార్డును ఇప్పటిదాకా ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్ రికార్డు ఈ సారి అయినా బ్రేక్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది...

2016 వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన భారత జట్టు, అక్కడ ఓ తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో మొత్తంగా 489 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 245 పరుగుల భారీ స్కోరు చేసింది. 

Latest Videos


కెఎల్ రాహుల్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలవగా ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ అవుట్ కావడంతో భారత జట్టు 1 పరుగు తేడాతో ఓడింది. అయితే ఈ రికార్డు ఆరేళ్లుగా చెక్కుచెదరలేదు...

ఆరోన్ ఫించ్ 2018లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 76 బంతులాడి 172 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్‌గా నిలిచిన ఆరోన్ ఫించ్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు బాదడు. టీ20ల్లో ఇది కూడా ఓ రికార్డు. నాలుగేళ్లుగా ఈ రికార్డులు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు...

zazai

2019లో ఆఫ్ఘాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హజ్రతుల్లా జజాయి, ఉస్మాన్ గనీ కలిసి 105 బంతుల్లో 236 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20ల్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. మూడేళ్లుగా ఈ రికార్డును ఏ జట్టూ బ్రేక్ చేయలేకపోయింది...

click me!