షాహీన్ ఆఫ్రిది... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఈ యంగ్ బౌలరే. ఇన్నింగ్స్ మొదటి బంతికే రోహిత్ శర్మను గోల్డెన్ డకౌట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, సూపర్ ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
భారత బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నెముక లాంటి మూడు కీలక వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ ముగ్గురూ ఎలా అవుట్ అయ్యారో చూపిస్తూ స్టేడియంలో వ్యంగ్యంగా వెటకారంగా అనుకరించి చూపించాడు. భారత టాపార్డర్‌ను కకావికలం చేశాననే పొగరు, గర్వం అతనిలో కనిపించాయి...
27
Shaheen Afridi-Virat Kohli
ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు మోకాలి గాయంతో జట్టుకి దూరమయ్యాడు షాహీన్ ఆఫ్రిదీ. ఈ సమయంలో కూడా ఆఫ్రిదీ లేకపోవడం వల్ల భారత టాపార్డర్ బతికిపోయిందని పాక్ మాజీలు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు..
37
shaheen
గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన ఏడు టీ20ల సిరీస్‌కి, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్‌కి దూరమైన షాహీన్ ఆఫ్రిదీ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. ఆరు నూరైనా టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఆఫ్రిదీని ఆడించాలని గట్టిగా అనుకుంటోంది పాక్ క్రికెట్ బోర్డు...
47
అయితే షాహిన్ ఆఫ్రిదీపై గత మ్యాచ్ పరాభవానికి అదిరిపోయే ప్రతీకారం తీర్చుకోవాలని కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘షాహీన్ ఆఫ్రిదీ... ఇప్పుడు అతని లెక్క సరిచేయాల్సిన బాధ్యత భారత బ్యాటర్లదే. అతని బౌలింగ్‌లో అవుట్ అవ్వకుండా ఉండడం కాదు,
57
shaheen afridi
బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును ఊరకలు పెట్టించాలి. లాస్ట్ మ్యాచ్‌లో ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాం కదా అని జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకోవడానికి కూడా మనం తక్కువ అయిపోయినట్టే...
67
Shaheen Afridi
షాహీన్ ఆఫ్రిదీ అయిన మరే బౌలర్ అయినా ఫుట్‌వర్క్ సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు, ఈజీగా పరుగులు చేయొచ్చు. టాస్ అనేది మన చేతుల్లో లేదు. టాస్ ఓడిపోయినా సరే భారత బ్యాటర్లు స్థాయికి తగ్గట్టు రాణిస్తే భారత జట్టును మంచి పొజిషన్‌లో పెట్టొచ్చు...
77
భారత జట్టులో ఒకటికి ముగ్గురు, నలుగురు క్వాలిటీ బ్యాటర్లు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు సూపర్ ఫామ్‌లో కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి షాహీన్ షా ఆఫ్రిదీని టార్గెట్ చేస్తారనే అనుకుంటున్నా... ఈసారి కొట్టే దెబ్బ అతనికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..