తప్పు తెలుసుకున్నారు, అందుకే వాళ్లను పంపుతున్నారు... టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ సెటైర్లు...

Published : Oct 14, 2022, 12:53 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హాట్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకడిగా ఉంటుందనుకున్న భారత జట్టుపై ఇప్పుడు పెద్దగా అంచనాలు లేవు. కారణం స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడి ఈ మెగా టోర్నీకి దూరం కాగా దీపక్ చాహార్ కూడా అందుబాటులో ఉండడం లేదని తేలింది.. కీలక ప్లేయర్లు దూరం కావడంతో భారత జట్టుపై అంచనాలు తగ్గిపోయాయి...

PREV
15
తప్పు తెలుసుకున్నారు, అందుకే వాళ్లను పంపుతున్నారు... టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ సెటైర్లు...

జస్ప్రిత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని, దీపక్ చాహార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని ఆస్ట్రేలియాకి పంపించింది టీమిండియా. ఈ ఇద్దరితో పాటు ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ కూడా ఆస్ట్రేలియా వెళ్తున్నారని, ఈ ఇద్దరూ నెట్ బౌలర్లుగా వ్యవహరిస్తారని సమాచారం...

25
Image credit: PTI

‘టీమిండియా టీమ్ సెలక్షన్‌లో చేసిన తప్పులను లేటుగా తెలుసుకున్నట్టు ఉంది. డెత్ ఓవర్లలో సరైన బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భారత బౌలింగ్ యూనిట్ మునుపటిలా ప్రత్యర్థులను భయపెట్టేలా లేదు. వారికి సరైన స్వింగ్ బౌలర్ కూడా ఎవ్వరూ లేరు...
 

35
Mohammed Shami

ఆస్ట్రేలియాలో స్వింగ్ బౌలర్ లేకుండా ఆడడం చాలా పెద్ద సమస్యే. అదీకాకుండా భారత బౌలర్లు వరుసగా 200+ స్కోర్లను అప్పగించేస్తున్నారు. షమీలాంటి బౌలర్ ఏ జట్టుకైనా గొప్ప ఆస్తి... అతని స్కిల్స్, అనుభవం జట్టుకి ఎంతో ఉపయోగపడతాయి...

45
Image credit: Getty

సిరాజ్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్‌లో ఆల్‌రౌండ్ స్కిల్స్‌ ఉన్నాయి. హార్ధిక్ పాండ్యాకి కవర్‌గా కూడా పనికొస్తాడు. షమీ లాంటి అనుభవం ఉన్న బౌలర్‌ని టీ20లకు దూరం పెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని టీమిండియా చాలా లేటుగా తెలుసుకుంది...

55
Image credit: Getty

అతను ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్‌ ఆడాడు. అక్కడ వికెట్లు రావాలంటే ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. సిరాజ్‌ సౌతాఫ్రికా సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ నెగ్గాడు. అతని బౌలింగ్‌లో మంచి పేస్ ఉంది... బుమ్రా స్థానంలో సిరాజ్ అయితే కరెక్ట్ అని నా అభిప్రాయం...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్... 

click me!

Recommended Stories