టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. 20 రోజులకు పైగా క్రికెట్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించిన ఈ మెగా క్రికెట్ టోర్నీ, ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు, ఇంగ్లాండ్‌తో తలబడనుంది...
2007లో టీమిండియా చేతుల్లో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ జట్టు, 2009లో శ్రీలంకను ఓడించి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి...
28
england
2010 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి టైటిల్ గెలిచింది ఇంగ్లాండ్ జట్టు. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలవలేకపోయిన ఇంగ్లాండ్‌కి ఇది మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్... ఈ టోర్నీ తర్వాత 2016లో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, మూడోసారి ఫైనల్ ఆడబోతోంది...
38
Pakistan-England
ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య టీ20 వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులు జరగగా రెండింట్లోనూ ఇంగ్లాండ్‌నే విజయం వరించింది. 2009 గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని 48 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్, 2010లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...
48
ఫైనల్ మ్యాచ్‌కి ముందు ట్రోఫీతో కలిసి ఇద్దరు ఫైనలిస్టులు ఫోటోలు దిగారు. కుడి వైపు బాబర్ ఆజమ్ నిలబడగా ఎడమవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ట్రోఫీ సెంటిమెంట్ ప్రకారం ఈసారి పాక్, టీ20 వరల్డ్ కప్ గెలవబోతుందని చెబుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
58
Eoin Morgan, Kane Williamson
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కుడి వైపు నిలబడగా, ఎడమవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ నిలబడ్డాడు. కుడివైపు నిలబడిన ఇంగ్లాండ్‌కి సూపర్ ఓవర్‌లో ‘సూపర్’ విజయం దక్కింది...
68
2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కుడివైపు నిలబడగా, మళ్లీ ఎడమవైపే నిలబడ్డాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్. ఈసారి కూడా కుడి సైడ్ తీసుకున్న ఆరోన్ ఫించ్ టీమ్‌కే వరల్డ్ కప్ దక్కింది...
78
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ ప్లేస్ మార్చి కుడివైపు నిలబడ్డాడు. ప్లేస్ మారగానే కేన్ మామ ఫేట్ కూడా మారిపోయింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచింది న్యూజిలాండ్ జట్టు...
88
Pakistan Win
ఆ విధంగా చూసుకుంటే కుడివైపు నిలబడిన బాబర్ ఆజమ్ టీమ్ గెలవబోతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ నుంచి ఇలాంటి సెంటిమెంట్స్ ఎన్నో వినిపించాయి. 2011 వన్డే వరల్డ్ కప్ హిస్టరీ రిపీట్ అవుతుందని భారీ ఆశలు పెట్టుకున్న టీమిండియా ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది...