ఓటమిని తట్టుకోలేకపోతున్న రోహిత్ శర్మ... డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఎమోషనల్! అందుకే మీడియా ముందుకి...

First Published | Nov 12, 2022, 12:42 PM IST

ఎన్నో ఆశలు, అంతకుమించిన అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, తాత్కాలిక కెప్టెన్‌గా ఆసియా కప్ 2018 టోర్నీ కూడా గెలిచాడు. ఈ సమయంలోనే టీమిండియా కెప్టెన్‌గా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

రోహిత్ శర్మ కోరిక నెరవేరడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. 2007లో అంతర్జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో 2021లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు...

Image credit: PTI

34 ఏళ్ల లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మకు లీడర్‌షిప్ కిక్కుని ఇవ్వకపోగా తీవ్రమైన ప్రెషర్‌లోకి నెట్టేసింది. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక రోహిత్ శర్మ బ్యాటు నుంచి తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు...

Latest Videos


Rohit Sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది భారత జట్టు. ఫిట్‌నెస్, వర్క్ లోడ్.. ఇలా కారణమేదైనా రోహిత్ శర్మ, టీమిండియాకి అందుబాటులో ఉన్న మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచి నిష్కమించిన టీమిండియా, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పోరాటం కారణంగా గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది...

rohit sharma

ఈ మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్‌లో ఎమోషనల్ అవ్వడం కనిపించింది. ఈ మ్యాచ్ తర్వాత మీడియా సమావేశానికి కూడా రోహిత్ శర్మ రాలేదు. టీమిండియా కెప్టెన్ స్థానంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మీడియాతో మాట్లాడాడు...

Rohit sharma after India vs England Semifinal

అయితే రోహిత్ శర్మ మీడియా సమావేశానికి రాకపోవడానికి అతను ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోవడమే కారణమట. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత రోహిత్ శర్మ... ఏడ్చేయడం, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ వంటి ప్లేయర్లు అతన్ని ఓదార్చడం జరిగిందట. అందుకే రోహిత్ శర్మ, ప్రెస్ మీట్‌కి రాలేదని తెలుస్తోంది...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి నుంచి 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్... ఇలా ఎన్నో ఓటములను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా... మీడియా మీట్‌ని ఎప్పుడూ మిస్ చేయలేదు. ఘోర పరాజయాల తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడని గుర్తు చేస్తున్నారు కోహ్లీ అభిమానులు...
 

click me!