సూర్య ఆడకపోతే టీమిండియా 140 కూడా చేయలేదు... టాపార్డర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Nov 7, 2022, 2:35 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్‌కి దూసుకొచ్చింది. టేబుల్ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు, నవంబర్ 10న ఇంగ్లాండ్ జట్టుతో సెమీ ఫైనల్ ఆడబోతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకి కీలక ప్లేయర్‌గా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్...

Image credit: Getty

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 15 ఓవర్లు ముగిసే సమయానికి 107 పరుగులే చేసింది టీమిండియా. మిగిలిన 5 ఓవర్లలో 40 పరుగులు వచ్చినా 150 దాటడం కష్టం. అలాంటిది టీమిండియా 186 పరుగుల భారీ స్కోరు చేయగలిగిదంటే అది సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన విధ్వంసమే...

Image credit: Getty

25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు రాబట్టగలిగింది...

Image credit: PTI

‘సూర్యకుమార్ యాదవ్ ఆడిన ప్రతీ ఇన్నింగ్స్‌ కూడా 360 డిగ్రీస్‌లో చూడాల్సిందే. అతను మన మిస్టర్ 360 డిగ్రీ. వికెట్ కీపర్ పక్కన్నుంచి సూర్య కొట్టిన సిక్సర్ ఇప్పటికీ నా కళ్ల ముందే తిరుగుతోంది. అసలు అదెలా సాధ్యమో నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు...

బౌలర్ ఎంత బాగా బౌలింగ్ చేసినా బౌండరీలు రాబట్టడం అందరి వల్లా అయ్యే టాలెంట్ కాదు, ఆ స్పెషల్ టాలెంట్ సూర్యలో నిండుగా ఉంది. అతను ఆడిన ఒక్కో షాట్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అతనిలా ఎవ్వరూ ఇంత ఈజీగా షాట్స్ ఆడలేరు...

Image credit: PTI

టీమిండియాకి ఇప్పుడు సూర్యనే కీ ప్లేయర్. సూర్యకుమార్ యాదవ్ ఆడకపోతే, టీమిండియా స్కోరు 140-150 దాటడం కూడా కష్టమే. జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్య చేసిన 61 పరుగులు తీసి వేస్తే... టీమిండియా స్కోరు 125 పరుగులు మాత్రమే...

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కెఎల్ రాహుల్ కూడా మంచి టచ్‌లోకి వచ్చాడు. అయినా టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి 120 పరుగులు కూడా చేయలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది...

Image credit: Getty

కెఎల్ రాహుల్‌ కుదురుకోవడానికి సమయం తీసుకుంటున్నాడు, అయితే తనకి దక్కిన శుభారంభాలను కరెక్టుగా వాడుకోలేకపోతున్నాడు. రోహిత్ శర్మ పరుగులు చేస్తే, టీమిండియాని ఎవ్వరూ ఆపలేరు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్...

click me!