ఆసియా కప్‌తో పాటు మిగిలిన సిరీసుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భువనేశ్వర్ కుమార్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టాప్ క్లాస్ బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. అలాగే యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, సీనియర్ మహ్మద్ షమీ అంచనాలకు మించి రాణిస్తున్నారు...
అయితే భారత బ్యాటింగ్‌లో మాత్రం లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా భారత జట్టు ఐదు మ్యాచులు ఆడితే అందులో నాలుగు విజయాలు అందుకుంది. ఈ నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు విరాట్ కోహ్లీ, మిగిలిన రెండు సార్లు సూర్యకుమార్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్నారు...
Virat Kohli-Suryakumar Yadav
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 5 మ్యాచుల్లో 123 సగటుతో 246 పరుగులు చేసి... అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...
Virat Kohli-Suryakumar Yadav
అలాగే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాతి మ్యాచ్ నుంచి ఓ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 25 బంతుల్లో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు...
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 40 బంతుల్లో 68 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. మొత్తంగా టోర్నీలో 5 మ్యాచుల్లో 75 సగటుతో 225 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్...
Image credit: Getty
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉంటే, సూర్యకుమార్ యాదవ్ టాప్ 3లో ఉన్నాడు. టాప్ 15 జాబితాలో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం...
Image credit: Getty
మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజట్ స్కోరుకే అవుటైన కెఎల్ రాహుల్, ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై హాఫ్ సెంచరీలు బాదాడు. ఇప్పటిదాకా 123 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 2022 టోర్నీలో టీమిండయా తరుపున అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా ఉన్నాడు...
Rohit Sharma
కెప్టెన్ రోహిత్ శర్మ 17.8 సగటుతో 89 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 65 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మిగిలిన మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు...
KL Rahul
బంగ్లా, జింబాబ్వేలపై వరుసగా హాఫ్ సెంచరీలు చేసినా మొదటి ఓవర్‌లో సింగిల్ తీయడానికి కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు కెఎల్ రాహుల్. గత మూడు మ్యాచుల్లో రెండు మెయిడిన్ ఓవర్లు సమర్పించి, రోహిత్ శర్మపై ఒత్తిడి పెరగడానికి కారణమవుతున్నాడు కెఎల్ రాహుల్...
Image credit: PTI
మ్యాచ్ ఫినిషర్ అవుతాడనుకున్న దినేశ్ కార్తీక్, మొదటి నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు ఫెయిల్ కావడంతో అతని ప్లేస్‌లో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతులాడి 3 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్...
భారత బ్యాటింగ్ భారమంతా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లపైనే పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ త్వరగా అవుట్ అయితే పరిస్థితి ఏంటి? ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియా ఫ్యాన్స్‌ని ఈ విషయం తెగ కంగారుపెడుతోంది... టీమిండియా ఫైనల్ చేరాలంటే రోహిత్ శర్మ బ్యాటుకి పని చెప్పాల్సిందే...