PAK vs NZ
ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్ చేరడం ఇది 16వ సారి కాగా న్యూజిలాండ్ 15వ సారి, ఇంగ్లాండ్‌కి 14వ సారి. ఆస్ట్రేలియా 16 సార్లు సెమీస్ చేరి.. భారత్, పాకిస్తాన్‌లతో కలిసి టాప్‌లో ఉంది...
2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, న్యూజిలాండ్‌ని ఓడించలేకపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఐసీసీ 2021 టీ20 వరల్డ్ కప్‌లో, ఆఖరి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ కివీస్ చేతుల్లో భారత జట్టుకి పరాజయమే ఎదురైంది...
అయితే మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కి చుక్కలు చూపిస్తోంది.. 1983 వన్డే వరల్డ్ కప్‌లో, 1992, 1996, 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది పాకిస్తాన్...
టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ న్యూజిలాండ్‌పై పాకిస్తాన్‌కి తిరుగులేని రికార్డు ఉంది.టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఆరుసార్లు తలబడ్డాయి. ఇందులో నాలుగు సార్లు పాక్ గెలిస్తే, రెండు సార్లు న్యూజిలాండ్ గెలిచింది...
2007 టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓడింది కివీస్. 2009 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్. ఈ లక్ష్యాన్ని పాక్ 13.1 ఓవర్లలో ఛేదించింది...
2010 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 134 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్, 132 పరుగులకు పరిమితమై 1 పరుగు తేడాతో ఓడింది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది పాకిస్తాన్...
2016 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్‌పై 22 పరుగుల తేడాతో గెలిచింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా సెమీస్‌కి అర్హత సాధించింది పాకిస్తాన్...
NZ vs PAK
న్యూజిలాండ్ ప్రస్తుతమున్న ఫామ్ చూస్తే ఆ జట్టును ఓడించడం కొంచెం కష్టమే. అయితే తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో చెప్పలేం... కివీస్‌కి కళ్లెం వేయగల సత్తా పాక్‌కి పుష్కలంగా ఉంది. పాక్‌ని చిత్తు చేసి వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ చేరగల సామర్థ్యం కివీస్‌లో ఉంది. మరి ఈ ఇరు జట్లలో ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేదెవరో బుధవారం తేలిపోనుంది.