అతను మంచోడు! చెబితే వింటాడు, నేనైతేనా అలా కాదు... అల్లుడిపై షాహీద్ ఆఫ్రిదీ కామెంట్స్...

First Published Nov 5, 2022, 3:31 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో షాహీన్ ఆఫ్రిదీ, పాకిస్తాన్‌కి స్టార్‌గా మారతాడని అనుకున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచుల్లో ఆఫ్రిదీ నుంచి సరైన పర్ఫామెన్స్ రాలేదు. గాయం నుంచి కోలుకున్న ఆఫ్రిదీ... నెలన్నర తర్వాత క్రీజులోకి అడుగుపెట్టాడు...

world cup

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన షాహీన్ ఆఫ్రిదీ... జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఓ వికెట్ తీసి పర్వాలేదనిపించాడు షాహీన్...

shaheen

మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి, బంగ్లాదేశ్- పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్‌కి దూరమయ్యాడు షాహీన్ ఆఫ్రిదీ. టీ20 వరల్డ్ కప్‌లోనూ షాహీన్ ఆడడం అనుమానమేనని టాక్ వినబడింది.

shaheen

గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీని ఎలాగైనా ఆడించాలని పట్టుబట్టింది పాకిస్తాన్. అందుకే 90 శాతం ఫిట్‌గా ఉన్న షాహీన్ ఆఫ్రిదీని అలాగే బరిలో దింపింది... దీంతో షాహీన్ 100 శాతం రిజల్ట్ చూపించలేకపోయాడు...

Image credit: PCBTwitter

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ.. పాక్‌కి కీలక విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి 2 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన షాహీన్ ఆఫ్రిదీ, తాను వేసిన మూడో ఓవర్‌లో 12 పరుగులు సమర్పించాడు...

Shaheen Afridi-Shahid Afridi

‘పేస్‌తో బౌలింగ్‌ చేయాలంటే బాడీ వేడిగా ఉంటాలి. అయితే ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా చల్లగా ఉంటాయి. అందుకే శరీరాన్ని వేడి చేయడానికి మ్యాచ్‌కి ముందు వార్మప్ చాలా అవసరం. అదీకాక అక్కడి పిచ్‌లు స్వింగ్‌కి అనుకూలించడం లేదు. కాబట్టి లెంగ్త్‌ని కాస్త తగ్గించుకోవాలి...

Mohamed Shami-Shaheen Afridi

షాహీన్ ఆఫ్రిదీ చాలా మంచి కుర్రాడు. అందుకే నేను ఏం చెప్పినా వింటాడు. సలహాలు స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నేను ఆ వయసులో అలా ఉండేవాడిని కాదు. ఎవరేం చెప్పినా పట్టించుకునేవాడిని కాదు. నాకు నచ్చినట్టు చేసేవాడిని...

shahid

ఎవరైనా సలహాలు చెప్పడానికి వస్తే వాడేంది నాకు చెప్పేదన్నట్టు ఉండేది నా యాటిట్యూడ్. సౌతాఫ్రికాతో మ్యాచ్ సమయంలో షాహీన్ ఎలా వేస్తాడోనని చాలా కంగారుపడ్డా. అందుకే ఇంటికి ఫోన్ చేసి మొదటి ఓవర్ వీడియో తీసి పెట్టమని చెప్పా. అది చూశాక చాలా సంతోషమేసింది...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ ఆఫ్రిదీ...

afridi

పాక్ మాజీ క్రికెటర్ షాహీదీ ఆఫ్రిదీ కూతురితో ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన తర్వాత వీరి విహహం జరగబోతుందని సమాచారం. 

click me!