పాక్‌కి వెళ్లాలంటే భయపడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు... ఇమ్రాన్ ఖాన్‌పై దాడితో మళ్లీ పాత పరిస్థితులు...

First Published | Nov 5, 2022, 1:30 PM IST

పాకిస్తాన్‌లో మళ్లీ పాత పరిస్థితులే రాబోతున్నాయా? పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఉగ్రదాడి... అక్కడ పరిస్థితులు ఇప్పటికీ ఏం మారలేదని నిరూపిస్తున్నాయా? ఈ సంఘటన తర్వాత మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు మిగిలిన దేశాలు సాహసిస్తాయా? ఇప్పుడు పొరుగుదేశంలో ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది... 

2009లో పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో అజంతా మెండీస్, కుమార సంగర్కర, మహేళ జయవర్థనేతో సహా ఆరుగురు క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు పోలీస్ అధికారులతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

తుపాకీ బుల్లెట్ల నుంచి తమని తాము కాపాడుకోవడానికి శ్రీలంక క్రికెటర్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. క్రికెట్ చరిత్రలోనే ఇదో విషాద సంఘటనగా మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఉగ్రవాదులకు స్థావరంగా మారిన పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ సాహసించలేదు..


PAK vs NZ

దాదాపు దశాబ్దానికి పైగా తటస్థ వేదికపై యూఏఈలో మ్యాచులు నిర్వహిస్తూ వచ్చింది పాకిస్తాన్. మెల్లిమెల్లిగా పరిస్థితులు సద్ధుమణిగి ఆఫ్ఘాన్, జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్ వంటి చిన్న చిన్న జట్లు... పాక్‌లో క్రికెట్ ఆడడం మొదలెట్టాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ముందు కూడా పాక్‌ పర్యటనకి వెళ్లిన న్యూజిలాండ్, సిరీస్ ఆరంభానికి ముందు భద్రతా కారణాలతో వెనక్కి వచ్చేసింది...

ఇంగ్లాండ్ కూడా పాకిస్తాన్‌లో ఆడాల్సిన సిరీస్‌ని రద్దు చేసుకుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త మెరుగు కావడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు పాక్‌లో అడుగుపెట్టాయి. సిరీస్‌లు ఆడాయి. దాదాపు 15-20 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగుపెట్టాయి ఈ దేశాలు...

పరిస్థఇతి కుదురుకుంటుందని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సంతోషపడుతున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన ఉగ్రదాడి, అంతా తలకిందులు చేసేసింది... ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు భయపడుతున్నారు...

imran khan

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు, పాక్‌లో పర్యటించాల్సి ఉంది. డిసెంబర్ 1 నుంచి 21 వరకూ మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, పాక్‌లో అడుగుపెట్టాలంటే భయమేస్తోందని కామెంట్ చేశాడు...

ఇంగ్లాండ్ తర్వాత న్యూజిలాండ్ కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లు పాకిస్తాన్‌లో అడుగుపెడతాయా అనేది అనుమానమే...

Latest Videos

click me!