అంతన్నడు, ఇంతన్నడు! ఆఖరికి ఏడుస్తూ కూర్చున్నడు... జింబాబ్వేతో ఓటమి తర్వాత షాదబ్ ఖాన్ ఓవరాక్షన్...

First Published | Oct 28, 2022, 5:38 PM IST

భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్ జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 రౌండ్‌కి వచ్చిన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓడింది పాకిస్తాన్...

Pakistan Team

జింబాబ్వే చేతుల్లో పాక్ పరాభవాన్ని టీమిండియా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటే... ఈ అవమానంతో తల ఎక్కడ దాచుకోవాలో తెలియక పాక్ ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు. జింబాబ్వే చేతుల్లో పరాజయం, పాక్ క్రికెట్ టీమ్‌కి కూడా చాలా పెద్ద షాకే... కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు మిగిలిన ప్లేయర్లు కూడా షాక్‌కి గురయ్యారు...

జింబాబ్వేతో మ్యాచ్ ఓడిన తర్వాత పాక్ క్రికెటర్లు కొందరు కన్నీళ్లు పెట్టుకుని, ఏడవడం కూడా టీవీల్లో కనిపించింది. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో షాదబ్ ఖాన్ కుప్పకూలి ఏడుస్తున్న వీడియో... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి పాక్ ఫ్యాన్స్ ఎమోషనల్ స్పందిస్తున్నారని అనుకుంటే.. క్రీజు దాటి రనౌట్ అయినట్టే!


షాదబ్ ఖాన్ ఓవరాక్షన్ మొదలెట్టాడని... ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడి, ఏదో బాగా కష్టపడినట్టు ఈ నాటకాలు ఏంటని కామెంట్లు పెడుతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. ఇకనైనా ఓవర్ బిల్డప్‌లు తగ్గించుకుంటే బాగుంటుందని హితవు చేస్తున్నారు...

pakistan team

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు షాదబ్ ఖాన్ చాలా కథలే చెప్పాడు. వరల్డ్‌లో మోస్ట్ డేంజరస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌ ఏదైనా ఉంటే అది పాకిస్తాన్‌నేనని చెప్పిన షాదబ్ ఖాన్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ రూపంలో టాప్ 2 బ్యాటర్లు కూడా పాక్‌ టీమ్‌లో ఉన్నాడని తెగ బిల్డప్ ఇచ్చాడు...

pakistan

ఆల్‌రౌండర్‌ అవుతాడని భారీ ఆశలే పెట్టుకున్న షాదబ్ ఖాన్, ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్‌లో సరైన పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, సికందర్ రజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే హైదర్ ఆలీ గోల్డెన్ డకౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి... మ్యాచ్‌ని ఫినిష్ చేయలేకపోయింది పాకిస్తాన్...

Pakistan vs Zimbabwe

ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్ విజయానికి చివరి 3 బంతుల్లో 3 పరుగులు కావాల్సి రాగా దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు పాక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు. నాలుగో బంతికి మహ్మద్ నవాజ్ పరుగులేమీ తీయలేకపోయాడు. ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి యత్నించి నవాజ్ అవుట్ కాగా ఆ తర్వాతి బంతికి 2 పరుగులు తీయబోయిన షాహీన్ ఆఫ్రిదీ, సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో 1 పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయాన్ని అందుకుంది.

Latest Videos

click me!