Image credit: Getty
గ్రూప్ 2లో ఉన్న భారత జట్టు ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో ఉంది. సూపర్ 12 రౌండ్‌లో మిగిలిన ఏ జట్టూ కూడా 4 పాయింట్లు సాధించలేదు. సౌతాఫ్రికా, జింబాబ్వేతో పాటు గ్రూప్ 1లో న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడేసి పాయింట్లతో ఉన్నాయి...
Image credit: Getty
గ్రూప్ 1లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో టేబుల్‌లో కింద ఉంటే గ్రూప్ 2లో బంగ్లాదేశ్ 2 పాయింట్లు సాధించింది. పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్ ఇప్పటిదాకా ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాయి. అయితే ఇకపై జరిగే మ్యాచులు టేబుల్‌ను తలకిందలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...
ireland
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఆఫ్ఘాన్‌పై మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తర్వాతి మ్యాచుల్లో మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకలతో మ్యాచులు ఆడనుంది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ సెమీస్ చేరడం వరుణుడి మీదే ఆధారపడి ఉంది...
Image credit: PTI
2021 టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాని మొదటి మ్యాచ్‌లో ఓడించిన న్యూజిలాండ్, మంచి రన్‌రేట్ సాధించింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తర్వాతి మ్యాచుల్లో శ్రీలంక, ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో మ్యాచులు ఆడనుంది న్యూజిలాండ్ టీమ్...
Image credit: Getty
న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో పాటు ఐర్లాండ్ జట్టుకి కూడా సెమీస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచినా, వర్షం కారణంగా రద్దయినా ఐర్లాండ్ పంట పండినట్టే. అప్పుడు న్యూజిలాండ్ జట్టుతో కలిసి ఐర్లాండ్ సెమీస్ రావచ్చు...
అలా జరిగితే 2019 వన్డే వరల్డ్ కప్ మాదిరిగా సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగొచ్చు. ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై ఏ మాత్రం మంచి రికార్డు లేని భారత జట్టు, న్యూజిలాండ్‌ని మరోసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మొత్తానికి 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీని వర్షం ప్రభావితం చేసినట్టే, 2022 టీ20 వరల్డ్ కప్ విజేతను డిసైడ్ చేయడంలోనూ వరుణుడు కీలక పాత్ర పోషించబోతున్నాడు. టాస్, పిచ్, పర్ఫామెన్స్‌లతో పాటు వర్షం కూడా వరల్డ్ కప్ రిజల్ట్‌లను డిసైడ్ చేయనుంది...