8 ఏళ్లుగా అరకేజీ బరువు కూడా పెరగని విరాట్ కోహ్లీ... రోహిత్, రిషబ్ పంత్‌లకు...

First Published | Nov 7, 2022, 12:28 PM IST

విరాట్ కోహ్లీ... ప్రపంచంలో మోస్ట్ ఫిట్టెస్ట్ క్రికెటర్. 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలో విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకున్న మ్యాచులు నాలుగంటే నాలుగే. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు విరాట్ కోహ్లీ...

టీమిండియా తరుపున ఆడాలంటే యో-యో టెస్టు ఒక్కటే ప్రామాణీకంగా ఉండేది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచేందుకు చాలా కృషి చేశాడు. ఫిట్‌గా ఉండే ప్లేయర్లకు మాత్రమే టీమిండియా తరుపున ఆడే అవకాశం ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు...

రాహుల్ తెవాటియాతో పాటు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్లను సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి వారి ఫిట్‌నెస్ ప్రమాణాలే ఓ కారణం. కెఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు తరుచూ గాయపడి, జట్టుకి దూరమవుతుంటే... ఇంత ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం విరాట్‌ కోహ్లీకి ఎలా సాధ్యమైంది?

Latest Videos


జిమ్‌లో వర్కవుట్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించే విరాట్ కోహ్లీ, 8 ఏళ్లుగా ఒకే శరీర బరువును మెయింటైన్ చేస్తున్నాడట. డైట్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నా, రెగ్యూలర్‌గా వర్కవుట్లు చేస్తున్నా... 8 ఏళ్ల పాటు ఒకే బరువుని మెయింటైన్ చేయడమంటే మామూలు విషయం కాదు...

‘8 ఏళ్లుగా నా శరీర బరువు అరకేజీ కూడా పెరగలేదు. 74.5 కిలోల నుంచి 75 కిలోల మధ్యే నా బరువుని మెయింటైన్ చేస్తూ వస్తున్నా... నా శరీరంపై నాకు కంట్రోల్ ఉంటే, మనసుని అదుపులో పెట్టుకోగలను. వర్కవుట్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలనే విషయాలపై క్లారిటీ ఉంటే చాలు... ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

Image credit: Getty

34 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడు 50 + హాఫ్ సెంచరీలు చేసి... అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ చేసే పరుగులు టీమిండియాకి కీలకంగా మారనున్నాయి..  

విరాట్ కోహ్లీ 8 ఏళ్లుగా ఒకే బరువు మెయింటైన్ చేస్తున్నాడని తెలియడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్‌ వంటి ప్లేయర్లను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ టీమిండియాకి ఎలా అందుబాటులో ఉండాలో విరాట్‌ని చూసి నేర్చుకోవాలని హితవు చేస్తున్నారు.. 

click me!