అతన్ని కావాలనే పక్కనబెట్టాం, అదే మా కొంపముంచింది... మిచెల్ స్టార్క్‌పై జార్జ్ బెయిలీ..

First Published | Nov 9, 2022, 2:19 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది ఆస్ట్రేలియా. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌ని ఆపడం ఎవ్వరి వల్లా కాదని అనుకున్నారంతా. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ... ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకే పరిమితమైంది...

Image credit: Getty

2021 టీ20 వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. మిగిలిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచినా... నెట్ రన్ రేట్ కారణంగా సూపర్ 12 రౌండ్ నుంచి నిష్కమించాల్సి వచ్చింది...

Rashid Khan

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాటు ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్... డిఫెండింగ్ ఛాంపియన్ రాతను మార్చేసింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 168 పరుగులు చేయగా, ఈ లక్ష్యఛేదనలో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఆఫ్ఘాన్ 4 పరుగుల తేడాతో ఓడింది...


Mitchell Starc

ఆఫ్ఘాన్‌ని 14 ఓవర్లలోపు ఆలౌట్ చేసి ఉంటే ఆస్ట్రేలియాకి సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉండేవి. అయితే ఈ మ్యాచ్‌లో ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్‌కి రెస్ట్ ఇవ్వడం... ఆస్ట్రేలియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. స్టార్క్ ప్లేస్‌లో వచ్చిన కేన్ రిచర్డ్‌సన్ 4 ఓవర్లలో 48 పరుగులిచ్చాడు...

‘ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్‌ని ఆడించకపోవడం మా కొంపముంచింది. వాస్తవానికి అతన్ని కావాలనే కూర్చోబెట్టాం. డెత్ ఓవర్లలో అతను సరిగ్గా రాణించడం లేదు. అతను అతని ప్లేస్‌లో కామెరూన్ గ్రీన్‌ని తీసుకొస్తే వర్కవుట్ అవుతుందని అనుకున్నాం...

ఇంతకుముందు మ్యాచుల్లో కామెరూన్ గ్రీన్ ఆ పని చేశాడు. జోష్ హజల్‌వుడ్‌ని పవర్ ప్లేలో వాడుతూ వస్తున్నాం. అలాగే ఆడమ్ జంపాని మిడిల్ ఓవర్లలో వాడుతున్నాం. ఆ మ్యాచ్‌లో మా ప్లాన్స్ వర్కవుట్ కాలేదు... అందుకే ఓడిపోయాం..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఛీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ...

Latest Videos

click me!