ఫైనల్ ఆడేది ఆ ఇద్దరే... టీ20 వరల్డ్ కప్ గెలిచేది వాళ్లే! ఏబీ డివిల్లియర్స్ కామెంట్..

First Published | Nov 9, 2022, 12:26 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. సూపర్ 12 రౌండ్ గేమ్‌లు ముగిసి... గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి ఇండియా, పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కి దూసుకొచ్చాయి. మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా పాక్ లక్కీగా సెమీస్‌కి చేరుకుని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

India

జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో పెద్దగా అంచనాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆరంభించిన టీమిండియా... టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. సెమీస్‌లోనూ టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి...

AB de Villiers

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీపై ఏబీ డివిల్లియర్స్ కొన్ని కామెంట్లు చేశాడు... ‘టాప్ టీమ్స్‌ అన్నీ సెమీ ఫైనల్‌కి వచ్చాయి. నా వరకూ ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరతాయని అనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండడం వల్ల టీమిండియా... టైటిల్ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...

Latest Videos


‘సూర్యకుమార్ యాదవ్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అతను ఎంతో దూరం ప్రయాణం చేసి, ఇక్కడిదాకా వచ్చాడు. ఐపీఎల్‌లో అతన్ని చూసినప్పుడు, సూర్య ఇక్కడిదాకా వస్తాడని అనుకోలేదు...

India vs Pakistan

ఆట మొదలైన తర్వాత అతని ప్లాన్స్ మొదలవుతాయి. ప్లాట్‌ఫామ్‌ని బిల్డ్ చేసి, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి... బౌలర్లను డామినేట్ చేయడం మొదలెడుతున్నాడు. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. అందరూ సూర్యని నాతో పోల్చి చూస్తున్నారు...

Suryakumar Yadav

నిజం చెప్పాలంటే నేను అతనంతా నిలకడగా ఎప్పుడూ ఆడలేదు. మరో 5 లేదా 10 ఏళ్లు ఇలాంటి పర్ఫామెన్స్ ఇస్తే, క్రికెట్ చరిత్రలో లెజెండ్‌గా తన పేరు లిఖించుకోగలడు. సూర్యకు తన శక్తి గురించి పూర్తి క్లారిటీ ఉంది. అందుకే దాన్ని కరెక్టుగా ఎలా వాడాలో అలా వాడుతున్నాడు...

Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్ ఆడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే అతను క్రీజులో ఉంటే నేను కూడా టీవీలకు హత్తుకుపోతా... టీమిండియాకి అతను కీ ప్లేయర్’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్..

click me!