Image credit: PTI
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 25+ పరుగులు కూడా చేయలేకపోయిన పిచ్‌పై సూర్య... చాలా సింపుల్‌గా ఫోర్లు, సిక్సర్లు బాదాడు...
బౌన్సీ పిచ్‌పై లుంగి ఇంగిడి నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్‌ను చావు దెబ్బ తీయగా మెయిడిన్ ఓవర్‌తో ఇన్నింగ్స్‌ని ఓపెన్ చేసిన వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ వేరే పిచ్‌పై ఆడుతున్నట్టుగా తన స్టైల్‌లో చెలరేగిపోయాడు...
‘సూర్యకుమార్ యాదవ్ వీక్‌నెస్‌ని పసికట్టడం చాలా కష్టం. ఎందుకంటే అతను ఇంత సింపుల్‌గా షాట్స్ ఆడుతుంటే ఏ బౌలర్ అయినా మ్యాచ్‌ని మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. పిచ్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయడానికి చాలా పాజిటివ్ మైండ్‌సెట్ కావాలి..
Image credit: Getty
సూర్యకుమార్ యాదవ్ చాలా క్లియర్‌గా ఉంటాడు. తాను ఎలా ఆడాలని ఫిక్స్ అయ్యి, క్రీజులోకి వచ్చాడో అలాగే ఆడి వెళ్తాడు. పిచ్‌తో కానీ, బౌలర్లతో కానీ అతనికి సంబంధం ఉండదు. ఎందుకంటే అతనికి 360 డిగ్రీస్ ఆడే సౌలభ్యం ఉంది...
Virat Kohli
గ్రౌండ్‌కి ఇరువైపులా ఆడగలిగినప్పుడు అతన్ని అవుట్ చేసేందుకు ఏం చేయాలనేది కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. బౌలర్లు కరెక్ట్ లెంగ్త్‌లో వేసినా, అతను ఈజీగా వాటిని బౌండరీ బయటపడేస్తున్నాడు. యార్కర్లు వేసినా ఇబ్బంది పడడం లేదు...
Image credit: PTI
ఏ బంతిని ఎలా ఆడాలో, ఏ వైపు వచ్చిన బంతిని ఎటు వైపు మళ్లించాలో సూర్యకుమార్ యాదవ్ డిక్షనరీలో ప్రతీదానికి సమాధానం ఉంది... అందుకే అతను టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్...