sri lanka
మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, లసిత్ మలింగ వంటి లెజెండరీ ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత శ్రీలంక పరిస్థితి దారుణంగా తయారైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన శ్రీలంక, గత రెండు ఎడిషన్లుగా క్వాలిఫైయర్ రౌండ్‌లో అసోసియేట్ దేశాలతో మ్యాచులు ఆడాల్సిన పరిస్థితిలో పడింది...
sri lanka
2009లో వరుసగా ఆరు మ్యాచుల్లో గెలిచి రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక, 2009, 2012 ఎడిషన్లలో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2014లో టీమిండియాని ఫైనల్‌లో ఓడించి మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచింది శ్రీలంక...
Image credit: Getty
2010లో సెమీ ఫైనల్ చేరిన శ్రీలంక, 2014లో న్యూజిలాండ్‌ని 60 పరుగులకే ఆలౌట్ చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 30 మ్యాచులు గెలిచిన మొట్టమొదటి జట్టుగా చరిత్ర లిఖించిన శ్రీలంక... 2022 ఎడిషన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది...
శ్రీలంక ఫామ్ కారణంగా ఆసియా కప్ 2022 సీజన్‌లోనూ ఆ జట్టుపై ఏ మాత్రం అంచనాలు లేవు. దానికి తగ్గట్టే మొదటి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది శ్రీలంక. అయితే ఆ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది లంక జట్టు...
Sri Lanka
బంగ్లాదేశ్‌ని ఓడించి సూపర్ 4 రౌండ్ చేరిన శ్రీలంక, ఆఫ్ఘాన్‌పై అదిరిపోయే రివెంజ్ తీర్చుకుని టీమిండియాపై ఘన విజయం అందుకుంది. అదే ఊపుతో పాకిస్తాన్‌ని వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి... రికార్డు స్థాయిలో ఆరోసారి ఆసియా కప్ గెలిచింది లంక జట్టు...
Image credit: Getty
ఆసియా కప్ 2022 గెలిచిన ఉత్సాహాంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అడుగుపెట్టింది శ్రీలంక.ఈసారి లంకపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తొలి మ్యాచ్‌లో అనామక జట్టు, నమీబియాతో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది శ్రీలంక.. ఈ పరాజయంతో లంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి...
sri lanka
ఏదో లక్కీగా ఆసియా కప్ గెలిచిందని, వీళ్లు ఇంకా ఏం మారలేదని శ్రీలంక ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.అ యితే ఆ తర్వాత వరుసగా యూఏఈ, నెదర్లాండ్స్ జట్లను ఓడించి సూపర్ 12 రౌండ్‌కి దూసుకొచ్చి పరువు కాపాడుకుంది శ్రీలంక.
గ్రూప్ టాపర్‌గా నిలిస్తే శ్రీలంక, సూపర్ 12 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో తలబడుతుంది.. ఈ హాట్ ఫెవరెట్లపై లంక క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తే... సెమీస్ చేరినా చేరొచ్చు... లేదంటే గ్రూప్ 2లోకి కానీ వస్తే శ్రీలంక, టీమిండియా మధ్య మ్యాచ్ ఉంటుంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా శ్రీలంకను ఓడించలేదు భారత జట్టు...