టీ20 వరల్డ్ కప్ జెర్సీని లీక్ చేసిన అశ్విన్... టీమిండియా కొత్త జెర్సీలో ఇంత విషయం దాగి ఉందా...

First Published Oct 17, 2021, 5:11 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ పూర్తైపోయింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ సందడి మొదలైపోయింది. గ్రూప్ స్టేజ్ మ్యాచులు ఆరంభం కాగా, అక్టోబర్ 24 నుంచి సూపర్ 12 రౌండ్‌ మ్యాచులతో రసవత్తరమైన పోరు సాగనుంది.  తాజాగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ధరించే బోయే జెర్సీ లుక్‌ని రివీల్ చేశాడు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా ధరించబోయే జెర్సీని కొన్నాళ్ల కిందటే అధికారికంగా విడుదల చేసినా.. దానిపై టీ20 వరల్డ్ కప్ జెర్సీపై ఉండాల్సిన లోగో ఉండకపోవడం, ‘బైజూస్’ అంటూ స్పాన్సర్ పేరు ఇండియా కంటే పెద్దగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు...

అయితే అది కేవలం టీమిండియా ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించిన వైట్ బాల్ మ్యాచులకు సంబంధించిన జెర్సీ మాత్రమే. 

చూడడానికి సాధారణంగానే కనిపిస్తున్నా టీమిండియా జెర్సీలో చాలా మ్యాటర్ ఉందట. బ్లూ కలర్ జెర్సీ మీద డార్క్ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న గీతలు... నిజానికి శబ్ద తరంగాలకు ప్రతిరూపం...

భారత జట్టు మ్యాచులు జరిగేటప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు చేసే ‘ఇండియా... ఇండియా’ అనే సౌండ్ వేవ్స్‌ని తీసుకుని, దానికి తగ్గట్టుగా జెర్సీని రూపొందించడం జరిగింది...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ధరించే బోయే జెర్సీని రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందే విరాట్ కోహ్లీ రివీల్ చేసేందుకు ప్రయత్నించాడు.. విరాట్ ఇచ్చిన ఓ వీడియో కాల్ ఇంటర్వ్యూలో అతను ఈ జెర్సీలో కనిపించినా, అందులో జెర్సీ స్పష్టంగా కనిపించలేదు. 

తాజాగా అశ్విన్, టీ20 వరల్డ్‌కప్ లోగో వేసి ఉన్న అధికారిక జెర్సీలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలో ఆయన కూతురు క్యూట్ స్మైల్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది...

‘నాన్న ఈ జెర్సీలో నిన్ను ఎప్పుడూ చూడలేదు నాన్న’ అని మా అమ్మాయి అడిగింది. అందుకే తను లేకుండా ఫోటో దిగాలని అనిపించలేదు’ అంటూ కాప్షన్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. 

నాలుగేళ్లుగా వైట్ బాల్ క్రికెట్‌కి దూరమైన రవిచంద్రన్ అశ్విన్‌ని, టీ20 వరల్డ్ ‌కప్ జట్టుకి ఎంపిక చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచారు బీసీసీఐ సెలక్టర్లు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 15 మ్యాచుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు వికెట్లు వచ్చాయి...

అయితే టీ20 వరల్డ్ ‌కప్ ‌టోర్నీలో అశ్విన్‌కి ఉన్న రికార్డు టీమిండియాకి సహాయపడుతుందని ఆశిస్తున్నారు సెలక్టర్లు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 3సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు. అదీకాకుండా 6.18 ఎకానమీతో బౌలింగ్ చేసి టీమిండియా తరుపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్‌గా ఉన్నాడు..

click me!