అందుకే చాహాల్‌ను టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయలేదు...అసలు విషయం బయటపెట్టిన విరాట్ కోహ్లీ...

Published : Oct 17, 2021, 03:15 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో యజ్వేంద్ర చాహాల్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండేళ్లుగా పొట్టి ఫార్మాట్‌లో ప్రధాన సభ్యుడిగా ఉంటున్న యజ్వేంద్ర చాహాల్‌‌ను ఎందుకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయలేదో విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు...

PREV
111
అందుకే చాహాల్‌ను టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేయలేదు...అసలు విషయం బయటపెట్టిన విరాట్ కోహ్లీ...

ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన యజ్వేంద్ర చాహాల్, 49 టీ20 మ్యాచుల్లో 63 వికెట్లు పడగొట్టాడు...

211

ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన యజ్వేంద్ర చాహాల్, యూఏఈలో జరిగిన 8 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అదరగొట్టాడు...

311

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో వికెట్లు తీయడంతో రాహుల్ చాహార్, రవిచంద్రన్ అశ్విన్ ఫెయిల్ అయిన తర్వాతైనా యజ్వేంద్ర చాహాల్‌ను టీ20 వరల్డ్‌కప్ జట్టులో చేరుస్తారని భావించారు. అయితే అలా జరగలేదు..

411

ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన అక్షర్ పటేల్‌ను రిజర్వు ప్లేయర్‌గా మార్చి, శార్దూల్ ఠాకూర్‌ను తుదిజట్టులో చేరుస్తూ నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు సెలక్టర్లు..

511

తాజాగా భారత సారథి విరాట్ కోహ్లీ ఈ విషయంపై స్పందించాడు... ‘యజ్వేంద్ర చాహాల్‌ను పక్కనబెట్టాలనే నిర్ణయం చాలా సాహసోపేతమైనదే... అయితే రాహుల్ చాహార్ కోసం అలా చేయాల్సి వచ్చింది...

611

గత రెండేళ్లుగా రాహుల్ చాహార్, ఐపీఎల్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. అతని బౌలింగ్‌లో ఉన్న పేస్, యూఏఈ పిచ్‌లకు సరిగ్గా సూట్ అవుతుందని అతన్ని ఎంపిక చేశాం...

711

టీ20 వరల్డ్‌కప్ వంటి విరామం లేకుండా జరిగే సుదీర్ఘ టోర్నీల కారణంగా పిచ్‌లు రోజురోజుకీ స్లో అవుతాయి. అప్పుడు పేస్‌తో బౌలింగ్ చేసే స్పిన్నర్లు కావాలి...

811

రాహుల్ చాహార్ ఓ లెగ్ స్పిన్నర్‌లా బౌలింగ్ చేస్తూ, వికెట్లు తీయగలడు. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో ఆడించాలనుకున్న అందర్నీ ఆడించడం వీలుకాదు... చాహాల్ విషయంలో అదే జరిగింది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

911

టీ20 వరల్డ్ ‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఐపీఎల్ 2021 సీజన్ పూర్తిచేసుకున్న యజ్వేంద్ర చాహాల్, స్వదేశానికి చేరుకున్నాడు...

1011

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సెలక్టర్లు, ఈసారి చాహాల్ విషయంలో అలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తోంది...

1111
r

స్వదేశంలో జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన రాహుల్ చాహార్, యూఏఈలో జరిగిన సెకండ్ ఫేజ్‌లో నాలుగు మ్యాచులు ఆడి రెండే వికెట్లు తీసి నిరాశపరచడం, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అతని పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చెబుతోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories