Published : Oct 16, 2021, 05:11 PM ISTUpdated : Oct 16, 2021, 05:12 PM IST
ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓ పీడకలలాంటి అనుభవాన్ని మిగిల్చింది. సీజన్‌లో మూడంటే మూడు విజయాలు మాత్రమే అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...
సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పులు, ఆటగాళ్ల గాయాలు, కరోనా పాజిటివ్ కేసులు... ఇలా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సీజన్ ఆసాంతం సమస్యలు వెంటాడాయి...
211
ఇవన్నీ పక్కనబెడితే ఐపీఎల్ 2021 సీజన్ ముగింపు వేడుకల్లో ఇచ్చే అవార్డుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మినహా, మిగిలిన అన్ని జట్లకీ ఏదో ఒక అవార్డు రావడం విశేషం...
311
పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ‘ఫేయిర్ ప్లే అవార్డు ఆఫ్ ది సీజన్’ అవార్డును సొంతం చేసుకుంది...
411
సీఎస్‌కేతో జరిగిన ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ నుంచి ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌కి ‘పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు దక్కింది...
511
పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ గాల్లోకి ఎగురుతూ పట్టిన క్యాచ్... ‘క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డును గెలుచుకుంది...
611
అలాగే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ని మిస్ చేసుకున్నప్పటికీ, 13 మ్యాచుల్లో 30 సిక్సర్లు బాదిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, ‘మోస్ట్ సిక్సర్స్ అవార్డు’ను సొంతం చేసుకున్నాడు...
711
మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటిల్స్ ప్లేయర్ సిమ్రన్ హెట్మయర్, ‘సూపర్ స్ట్రైయికర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును కైవసం చేసుకున్నాడు...
811
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి హర్షల్ పటేల్ ఏకంగా మూడు అవార్డులు సొంతం చేసుకున్నాడు.. 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులు గెలిచాడు..
911
ఐపీఎల్ 2021 సీజన్‌లో నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్ చేరలేకపోయినప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ఐపీఎల్ ఈవెంట్‌లో టైటిల్స్ ఏమీ సాధించకపోయినా మోస్ట్ పాపులర్ టీమ్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికైంది..
1011
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మాత్రం ఎలాంటి ఘనతా దక్కలేదు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు...
1111
సీజన్‌లో అత్యధిక కెప్టెన్లు ఉన్న టీమ్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌కి అవార్డు ఇవ్వాలని కామెంట్లు పెడుతున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్, వేలంలో ప్లేయర్లను కొనకుండా టీ, స్నాక్స్ ఆరగించే మేనేజ్‌మెంట్‌గా స్పెషల్ క్యాటగిరీ అవార్డు ఇవ్వాలంటూ ట్రోల్స్ చేస్తున్నారు...