T20 worlcup 2021: ధోనీయే కాదు, అతను లేకుండా టీమిండియా తొలిసారి... ఆ ప్లేయర్ లేకుండా పాక్...

First Published Oct 24, 2021, 8:23 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 సీజన్‌లో భారత జట్టు ప్రస్థానం మొదలైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో ఈ పొట్టి ప్రపంచకప్‌లో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు...

గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా తొలిసారి పొట్టి ప్రపంచకప్ బరిలో దిగుతోంది టీమిండియా...

మాహీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా, 2014 పొట్టి ప్రపంచకప్ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది టీమిండియా... 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్‌పై ఓడింది భారత జట్టు...

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మెంటర్‌గా భారత జట్టులో ఉంటే మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ లేకుండా ఇది తొలి టీ20 వరల్డ్‌కప్..

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, పొట్టి ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు...

యువరాజ్ సింగ్ కెరీర్‌లో 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఓ బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఎందుకంటే కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 21 బంతులాడి ఒక్క బౌండరీ బాదలేక కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు...

విరాట్ కోహ్లీ ఒక్కడు 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయడంతో 130 పరుగులకే పరిమితమైంది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు లక్ష్యాన్ని ఛేదించింది శ్రీలంక...

పాకిస్తాన్ జట్టు, టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలిసారి మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ లేకుండా ఆడుతోంది. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆఫ్రిదీ, పలుమార్లు రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 39 వికెట్లు పడగొట్టిన షాహిదీ ఆఫ్రిదీ, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండేవాడు. అయితే షకీబుల్ హసన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిదీని అధిగమించాడు..

టీమిండియా తరుపున రోహిత్ శర్మకు ఇది ఏడో టీ20 వరల్డ్‌కప్ కాగా,  పాకిస్తాన్ తరుపున షోయబ్ మాలిక్ ఏడో టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్నాడు...
 

click me!