T20 worldcup 2021: పాకిస్తాన్‌పై విరాట్‌‌ కోహ్లీ, రోహిత్ శర్మ గణాంకాలు... ‘హిట్‌మ్యాన్‌’కి దాయాదులపై...

First Published Oct 24, 2021, 5:12 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెర పడనుంది. అన్నీ సరిగా ఉంటే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరగనుంది..

దాయాది పాకిస్తాన్‌‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై అత్యద్భుతమైన రికార్డు ఉంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటిదాకా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో కోహ్లీ అవుటే కాకపోవడం విశేషం...

2012 టీ20 వరల్డ్‌కప్‌లో తన మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

ఈ మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేసిన విరాట్ కోహ్లీ, 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి పాక్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ను బౌల్డ్ చేసి అదరగొట్టాడు...

2014 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన 130 పరుగులు చేయగలిగింది. 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రైనాతో కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 66 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత జట్టుకి విజయాన్ని అందించాడు..

2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 118 పరుగులు చేసింది. 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీమిండియాకి విజయాన్ని అందించాడు...

విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మ రికార్డు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై ఏమంత సరిగా లేదు. 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఆడుతున్న రోహిత్, తన కెరీర్‌లో ఏడో టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్నాడు...

అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటిదాకా రోహిత్‌కి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

అయితే ఆ తర్వాత 2009లో 2, 2010లో 4, 2012లో 24 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2014లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు... 2016లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు...

మొత్తంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై ఆరు ఇన్నింగ్స్‌లో 17 సగటు, 130 స్ట్రైయిక్ రేటుతో 70 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఈ సారి తన లెక్కలను సరిచేసుకోవాలని అనుకుంటున్నాడు... 

click me!