టీమిండియా ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న గౌతమ్ గంభీర్... భారత్, పాక్ మ్యాచ్‌పై గౌతీ కామెంట్లతో...

First Published Oct 24, 2021, 6:09 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి ముందు సోషల్ మీడియా ఓ యుద్ధ వాతావరణం తలపిస్తోంది... నేటి మ్యాచ్‌లో విజయం మాదంటే, మాదంటూ ఇరు దేశాల అభిమానులు కొట్టుకోవడం మొదలెట్టేశారు. బీభత్సమైన హైప్ వచ్చేసిన ఈ మ్యాచ్‌కి ముందు గౌతమ్ గంభీర్ చేసిన ఓ పని, టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెడుతోంది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో తమ జట్టుకే విజయం దక్కాలని కోరుతూ పూజలు, హోమాలు, ప్రార్థనలు చేస్తున్నారు ఇరుదేశాల అభిమానులు...  

క్రికెట్‌లోనూ సెంటిమెంట్లు చాలా ఎక్కువే. ముఖ్యంగా పాకిస్తాన్‌, భారత్ వంటి దాయాది దేశాల మధ్క్ష్ జరిగే మ్యాచ్‌ విషయంలో అలాంటి సెంటిమెంట్లు ఓ రేంజ్‌లో ఉంటాయి... 

అలాంటి ఓ సెంటిమెంటే, ఇప్పుడు టీమిండియా అభిమానులను తీవ్రంగా కలవరబెడుతోంది. అదే భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఇండో పాక్ మ్యాచ్‌పై చేసిన కామెంట్లే...

‘నేటి మ్యాచ్‌లో భారత జట్టు తప్పకుండా గెలుస్తుంది. వాళ్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. వారి పర్ఫామెన్స్‌ను ఏ శక్తి కూడా ప్రభావం చూపించలేదు...

ఈ రోజు టీమిండియా కచ్ఛితంగా బాగా ఆడుతుంది. గెలుస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

గంభీర్ చేసిన కామెంట్లు పాజిటివ్ అయినా, గౌతీ ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తే, రిజల్ట్ దానికి విరుద్దంగా రావడం ఆనవాయితీగా వస్తోంది...

గత ఐపీఎల్ 2020 నుంచి తన ప్రిడక్షన్స్‌తో సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు గంభీర్. గౌతీ ఏ ప్లేయర్ ఆడతాడని చెబితే, అతను ఆ మ్యాచ్‌లో ఫెయిల్ కావడం, ఏ జట్టు గెలుస్తుందని చెబితే, అది ఓడిపోవడం జరుగుతూ వస్తోంది...

అందుకే గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని చెబితే, దానికి ప్రత్యర్థి టీమ్‌ విజయం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. బెట్టింగ్ రాయుళ్లు కూడా గౌతీ ప్రీడిక్షన్‌కి ఎంతో విలువిస్తారు... 

ఐపీఎల్ 2021 సీజన్‌ ప్రారంభంలో కూడా ఈ సారి ముంబై ఇండియన్స్ లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుస్తాయని అంచనా వేశాడు గంభీర్. ఆ రెండు జట్లూ ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయాయి...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్స్‌లో సీఎస్‌కే ఓడిస్తుందని అంచనావేశాడు గంభీర్. రిజల్ట్ దానికి విరుద్ధంగా వచ్చింది. గౌతీ ప్లేఆఫ్స్‌ కూడా చేరదని చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. 

దాంతో టీమిండియా గెలుస్తుందని గౌతమ్ గంభీర్ చెప్పడంతో టీమిండియా అభిమానులు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు...

click me!