సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

Published : Oct 16, 2021, 10:15 AM ISTUpdated : Oct 16, 2021, 10:27 AM IST

IPL 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఆ జట్టు టైటిల్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సీఎస్‌కే కనీసం ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించడం కూడా కష్టమేనంటూ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కామెంట్ చేశారు...

PREV
110
సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే కొనుగోలు చేసిన కృష్ణప్ప గౌతమ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ ఆలీ, ఛతేశ్వర్ పూజారా వంటి ప్లేయర్లను చూసి... సీఎస్‌కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ కాదు, సీనియర్ క్రికెటర్స్ క్లబ్ అంటూ ట్రోల్స్ కూడా చేశారు...

210

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఐపీఎల్ 2021 సీజన్‌లో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్... ప్లేఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచి, ఫైనల్‌లో కేకేఆర్‌ను చిత్తు చేసి నాలుగో టైటిల్ గెలిచింది...

310

గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌ కూడా చేరుకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచిన మాహీ టీమ్, ఈ ఘనత సాధించిన ఐదో జట్టుగా నిలిచింది... ఇంతకుముందు నాలుగు జట్లు ఇలా మాస్ కమ్‌బ్యాక్‌తో టైటిల్ గెలిచాయి...

410

ఐపీఎల్ 2008 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్. రెండంటే రెండే విజయాలు అందుకుని, 12 మ్యాచుల్లో ఓడింది...

510

అయితే ఆ తర్వాతి సీజన్‌లో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చిన డెక్కన్ ఛార్జర్స్, ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి టైటిల్ సాధించింది. 2009లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ, 2008 సీజన్‌లో ఏడో స్థానంలో ఉండడం మరో విశేషం...

610

2013 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన కోల‌్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత 2014లో ఊహించని పర్ఫామెన్స్‌తో టైటిల్ గెలిచింది. 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్, 2013లో ఆరో స్థానంలో ఉండడం కొసమెరుపు...

710

2016 సీజన్‌లో టైటిల్ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అంతకుముందు సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది.. అయితే 2016లో మాస్ కమ్‌బ్యాక్‌తో టైటిల్ సాధించింది...

810

ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కి మాస్ కమ్‌బ్యాక్ ఇవ్వడం బాగా అలవాటు. 2016 సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచి, ప్లేఆఫ్ బెర్త్ మిస్ అయిన ముంబై ఇండియన్స్, 2017లో టైటిల్ గెలిచి ఊర మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చింది...

910

అలాగే 2018 సీజన్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాతి సీజన్‌లో టైటిల్ సాధించి, చరిత్ర సృష్టించింది..

1010

ఈ సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్ ఐదో స్థానంలోనే నిలిచింది. నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. దీంతో వచ్చే సీజన్‌లో ముంబై మాస్ కమ్‌బ్యాక్ గ్యారెంటీ అంటున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్...

 

Must Read: IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!

Recommended Stories