సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి భారీ షాక్... గాయంతో నటరాజన్ దూరం...

Published : Apr 22, 2021, 09:05 PM IST

మోచేతి గాయంతో బాధపడుతున్న నటరాజన్... ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం రెండు మ్యాచులు మాత్రమే ఆడిన నట్టూ... మోచేతి గాయం తీవ్ర రూపం దాల్చడంతో 2021 సీజన్ మొత్తానికి దూరమైన యార్కర్ కింగ్...

PREV
17
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి భారీ షాక్... గాయంతో నటరాజన్ దూరం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడు ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అంతలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్, ‘యార్కర్ కింగ్’ నటరాజన్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

27

ఐపీఎల్ 2021 సీజన్‌లో రెండు మ్యాచులు ఆడిన నటరాజన్, మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తేల్చడంతో తిరిగి ఎన్‌సీఏలో చేరాడు నట్టూ. 

37

ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఎన్‌సీఏలోనే రెండు నెలల పాటు గడిపాడు నటరాజన్. 
అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన నట్టూ ఫిట్‌నెస్ గురించి ఎన్‌సీఏ ఫిజియో పర్యవేక్షిస్తునే ఉన్నారు...

47

నటరాజన్‌కి అయిన మోచేతి గాయం మరింత ప్రమాదకరంగా మారిందని గుర్తించిన ఫిజియో, మళ్లీ అతన్ని జాతీయ క్రికెట్ అకాడమీకి రావాల్సిందిగా సందేశం పంపాడు.

57

గత ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక యార్కర్లు వేసిన బౌలర్‌గా నిలిచిన నటరాజన్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో టీ20, వన్డే, టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే...

67

ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, కేన్ విలియంసన్, అబ్దుల్ సమద్ గాయాలతో సతమతమవుతుండడం... ఇప్పుడు నటరాజన్ సీజన్ మొత్తానికి దూరం కావడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

77

గత సీజన్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గాయాలు తీవ్రంగా వేధించాయి. భువనేశ్వర్ కుమార్‌తో పాటు మిచెల్ మార్ష్, విజయ్ శంకర్ గాయాల కారణంగా సీజన్ మధ్యలోనే తప్పుకున్నారు. 

click me!

Recommended Stories