IPL 2021 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విజయోత్సాహంతో బరిలో దిగుతుండగా... రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడింది.
నేటి మ్యాచ్‌లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్తుంది...
రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ మధ్య ఇప్పటిదాకా 20 మ్యాచులు జరగగా, ఇరు జట్లూ చెరో 10 మ్యాచుల్లో విజయం సాధించాయి. గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఆర్ఆర్ విజయం సాధించింది.
గత మ్యాచ్‌లో ముగ్గురు ఫారిన్ ప్లేయర్లతోనే బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నేటి మ్యాచ్‌లో రజత్ పటిదార్ స్థానంలో రిచర్డ్‌సన్‌కి అవకాశం ఇచ్చింది..
రాజస్థాన్ రాయల్స్ జట్టు:జోస్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, షాబజ్ అహ్మద్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, కేల్ జెమ్మీసన్, కేన్ రిచర్డ్‌సన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, చాహాల్